ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
పేట...పట్టినం...పురం...నగర్------జగదీశ్ యామిజాల-
August 26, 2020 • T. VEDANTA SURY • Memories

ఈ మాటలన్నీ ఓ ప్రాంతంలో ఉన్న చోట్లను తెలుపుతాయి. చెన్నైలో పలు చోట్లు బాక్కం, పేట్టయ్, పురం, నగర్, చావడి, మేడు అని ముగుస్తాయి.ఆదంబాక్కం, విల్లివాక్కం అని బాక్కం, వాక్కం అనే మాటలతో ముగిసిన చోట్లు. సముద్రతీర వర్తకులు నోవసించిన ప్రాంతాలు.కొరుక్కుపేట్టయ్, వన్నారప్పేట్టయ్ వంటివి పేట్టయ్ అనఘ మాటతో ముగిశాయి. ఇటువంటి ప్రదేశాలలో సంతలు విరివిగా ఉండేవి. కొరట్టూర్, కొళత్తూర్, పేరూర్ అనే చోట్లు ఊర్ అనే మాటతో ముగిశాయి. ఈ ప్రదేశాలలో పాత ఇళ్ళు ఉండేవి. రామాపురం, మాధవరం వంటివి పురం, వరం అనే మాటలతో ముగిసాయి. ఎంజిఆర్ నగర్, కెకె నగర్, వంటివి నగర్ అనే మాటలతో ముగిశాయి. ఇటువంటి చోట్లు పాతకొత్తలు కలిసున్న ప్రదేశాలు. కొత్వాల్ చావడి, వేలప్పన్ చావడి వంటివి చావడి అనే మాటతో ముగిశాయి. ఇటువంటి చోట్ల పన్నులు వసూలు చేసేవారు. చైనా బజార్, బర్మా బజార్ వంటివి బజార్ అనే మాటతో ముగిశాయి. మేము టీ. నగర్లోని తిలక్ స్ట్రీట్లో అద్దెకున్న రోజుల్లో ఓ పది అడుగుల దూరంలో ఓ వీధి పేరు న్యూబజార్ స్ట్రీట్. ఇలా బజార్ అనే మాట కలిగిన ప్రదేశాలలో దుకాణాలం విరివిగా ఉండేవి. ఇలా కొన్ని ప్రదేశాలకు ఆయా కారణాలతో వచ్చాయని ఆనోటా ఈనోటా వింటుంటే ఆసక్తికరంగా ఉండేది.
 నూట ఎనిమిది శక్తి స్థలాలలో యాభయ్యో ఊరు కావడంతో అయింబత్తూర్ అని అనేవారు. క్రమేణా ఆ మాట అంబత్తూర్ గా మారింది.
కూవం అనే నది పూర్వ నామం నులంబియార్. ఈ నదీ తీరంలో తిరువేంగడ పెరుముడయార్ అనే శివాలయం ఉండేది. సంస్కృతంలో సంతాన శ్రీనివాస పెరుమాళ్ అని మారింది. సంతానం అనేది కాస్తా మగప్పేరు అని చెప్పబడింది. తర్వాతి కాలంలో ఇది ముగప్పేర్ గా మారిందిగుర్రాల వ్యాపారి అయిన సయ్యద్ అహ్మద్ ఖాన్, అడయార్ నదిపై వంతెన నిర్మించడంతో,.సయ్యద్ షా పేట్టయ్ అనే పేరొచ్చి తర్వాతి కాలంలో సైదాపేట్టయ్ ఐని మారిందట.
అయితే మరికొందరి అభిప్రాయమేమిటంటే శరభోజి రాజు తల్లిగారైన సైదాంబాళ్ కి సొంతంగా ఓ ప్రదేశం ఉండేది. అందువల్ల ఆమె పేరు మీద సైదాపేట్టయ్ వచ్చిందన్నది వారి మాట.
వేలిచ్చేరి, వెలిచ్చేరి అనే ప్రాంతం వేలచ్చేరిగా మారిందట. ఇదిప్పుడు చెన్నై నగరంలోని ఓ ఖరీదైన ప్రాంతం 
ఆరు తోటలనే అర్థంలోని చే బేగ్ అనే ఉర్దు మాట నుంచే చేప్పాక్కం వచ్చినట్లు చెప్తారు. చేప్పాక్ లోనే ప్రధాన క్రికెట్ స్టేడియం ఉంది. ఒకప్పుడు దీనిని చేప్పాక్ స్టేడియం అనేవారు. తర్వాతి కొలంలో దీనికి  ఎం.ఎ. చిదంబరం స్టేడియం అని పేరు పెట్టారు.
సౌందర పాండియన్ బజార్ అనేదే పాండిబజార్ గా మారింది.
ఆవులను అధికంగా పెంచిన వారుండిన ప్రదేశం పల్ ఆ పురం, పల్లవపురం అని, తర్వాతి కాలంలో పల్లావరం అని మారింది.
పురసై చెట్లు దట్టంగా ఉండిన ప్రాంతాన్నే పురసైవాక్కం అనే పేరుతో పిలవబడుతోంది. 
మల్లెపూల తోటలు అధికంగా ఉన్న ప్రాంతం. తిరుక్కచ్చినంబి ఆళ్వార్ ఇక్కడ ఉండి కాంచి వరదరాజ పెరుమాళ్ కి పువ్వులు తీసుకుపోయి ఆరాధించేవారట. ఆ ప్రాంతాన్ని సంస్కృతంలో పంష్పవల్లి అని అనే వారు. తర్వాతి కొలంలో అది పూందమల్లిగా మారింది.
రామనాధపురం జిల్లాలోని తొండియ నుంచి వచ్చి నివసించిన ఓ ముస్లిం సాధువు పేరు కంణంగుడి మస్తాన్ సాహిబ్. ఆయన పేరు నుంచే తొండియార్ పేట్టయ్ అనే పేరొచ్చింది. కాలక్రమేణా అది తండయార్ పేట్టయ్ గా మారింది.
ఆవులు, మేకలు మేసిన ప్రాంతం కావడంతో మందైవెళి అనే పేరు వచ్చింది 
సుబ్రహ్మణ్యస్వామి యుద్ధం చేసి పెళ్ళి చేసుకున్న ఊరు కావడంతో పోరూర్ అనే పేరు వచ్చింది. తమిళంలో పోర్ అంటే యుద్ధం అని అర్థం. అయితే మరికొందరి మాటేమిటంటే పల్లవుల కాలంలో ఇక్కడ ఎక్కువ యుద్ధాలు జరిగాయట.
వెదురు, టేకు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం పెరంబూరుగా మారింది.
త్రిశూల్ నాథ ఆలయం ఉన్న చోటు త్రిశూలంగా మారింది.
గిండీ అనే పేరు గురించి కొందరు చెప్తూ విగడక్కూత్తు ఆడే దేవదాసీలు, కోట్టాళ కొండి స్త్రీలు నివసించిన ప్రదేశాన్ని గొండి అనే వారన్నారు. క్రమంగా అది కాస్తా గిండీగా మారిందట.
మొదటగా సూర్యోదయం జరిగే ఎత్తయిన ప్రదేశం, ఎయుమీశ్వరర్ ఒలయం ఉన్న ప్రాంతం, ఎయుంం ఊరుగా మారి కాలక్రమంలో ఎయుంబూర్ అయింది. ఇంగ్లీషులో egmore అని పిలువబడుతోంది.
మాధవుడు ఈశ్వరుడి దగ్గర వరం పొందిన ప్రదేశం మాధవ వరంగా మారింది. ఇది కాస్తా ఇప్పుడు మాధవరం అయింది
కోవూర్ ఈశ్వరుడి మౌళి అనే కిరీటం ఉండోన చోటు మౌళోవాక్కం అయింది. ప్రస్తుతం దీనిని ముగళివాక్కం అంటున్నారు.