ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రకృతిని కాపాడు --కళావతి కందగట్ల --హైదరాబాద్--9948263004
October 6, 2020 • T. VEDANTA SURY • Poem

ఓ మనిషీ 
మరుస్తున్నావెందుకు 
నీ మూలలను 
మరుగున దాస్తున్నావెందుకు 
నీ జీవన వైవిధ్యాన్ని

అత్యాశ పురుగు మదిలో 
దూరనీయకు... 
సారవంతమైన నేల లో 
రసాయనాలు వెదజల్లి 
మెతుకునిచ్చి బతికించే 
నేలమ్మను జీవచ్ఛం 
చేయకు.. తినే  తిండినీ 
విషపూరితం  చేసుకోకు...

ప్రగతి పేరుతో 
ప్రకృతి కి చేయకు హాని.... 
ఆరోగ్యకరమైన ఆహారానికి 
సేంద్రీయ ఎరువులు మేలు...