ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రజానినాదం --కె ఎస్ అనంతాచార్య
September 11, 2020 • T. VEDANTA SURY • Poem

అవినీతిని వణికించిన ఖలేజా
స్థాణువులను కదిలించిన
 బేజా

అన్యాయాన్నేదిరిస్తే
ముక్తి కి సోపానం !
అని నినదించిన  వేమన్న

రాజ్యానికి సమాజానికి 
సామరస్యం కోసం
 యుద్ధం చేసిన
కలం సూర్యుడు

అన్యభాషలు నేర్చి
తెలుగు నేర్వని మతుల
మీద మోగించిన భాషా ఫిరంగి
నాలుక మీద
 తొణికిసలాడే సత్యం
రక్తంలో 
ఎదురించే తత్వం 
హింస నేదిరించిన మానవత్వo

  జీవనది లా
నర నరాన తెలంగాణ 
తత్వాన్ని నింపుకొని
ఆంధ్రా పెత్తనపు డోల్లను
 కడిగి పారేసిన అగ్గిబరాట


మార్పుకోసం తీర్పును
తిరిగి రాయాలని
కీలెరిగి వాత పెట్టిన
వకీల్

కదిలే యంత్రానికి సలాం కొట్టి 
బతుకు పోరులో అలసిన దీనుల కొరకు కన్నీరు పెట్టిన దయాసముద్రం

కాగితాల మీద కవిత్వమై రగులుతూ
ఎదురించే గుండెకు ఏనుగంత బలమై
ఉనికి మూలకణమై నిలచిన కాళన్న 

పోటీ పడమని స్పూర్తినింపి
 భర్తీ చేయలేని స్థానo ప్రజల లో పొందిన
నిలువెత్తు  అభ్యుదయ 
అభిమాన ధ్వజ స్థంభం! కాళోజీ