ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రముఖ నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాల రావు జయంతి నేడు---మాడిశెట్టి గోపాల్- కరీంనగర్
September 4, 2020 • T. VEDANTA SURY • News

 ప్రసిద్ధిచెందిన తెలుగు నవలా రచయిత. పెంకుటిల్లు నవలా రచయితగా ప్రసిద్ధుడు.  కొమ్మూరి వేణుగోపాల్ రావు విజయవాడలో 4 సెప్టెంబర్, 1935 లో జన్మించారు.  13 సంవత్సరాల వయసు నుండే కథలు రాయడం ప్రారంభించారు. వందలాది కథలు రచించారు. ఆయన రాసిన *పెంకుటిల్లు* నవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకుంది. అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు. బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు.  " *ఆంధ్రా శరత్* "గా పేరొందారు.   సుమారు 50 పైగా నవలలు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో హౌస్ సర్జన్, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి ప్రేమ నక్షత్రం నవల సినిమాగా వచ్చింది. 1959 లో గోరింటాకు సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో మర మనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది. ఆయన సతీమణి అహల్యా దేవి. 
వృత్తిరీత్యా డాక్టర్ గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా రచనలు చేసేవాడు. ఆయన రాసిన *హౌస్ సర్జన్* ఎంతోమంది డాక్టర్లకు ప్రేరణను అందించింది. ఆయన రాసిన మరొక నవల *ఒక రక్తం ఒక మనుషులు* రక్తసంబంధీకుల పెళ్లిళ్ల గురించి వివరిస్తుంది. జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికత వైపు మళ్లీ *రేఖి* అనే నవల రాశారు. 
తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గొల్లపూడి మారుతీరావు గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని "ఇడియట్" అనే పేరుతో ఆంధ్ర జ్యోతి వారపత్రికలో 1968 లో ధారావాహికగా ప్రచురించారు.

కొమ్మూరి  కలిగించడానికి *సృష్టి రహస్యాలు* (1980) అనే సినిమాను కూడా నిర్మించాడు.


*ఆయన రచనలు కొన్ని*
ఆత్మ జ్యోతి
పిల్లదొంగ
పెంకుటిల్లు
చిన్నక్క
హౌస్ సర్జన్
హారతి
ఒకే పాటకు రెండు రాగాలు
వ్యక్తిత్వం లేని మనిషి
ఒకే రక్తం ఒకే మనుషులు
వెన్నెల ఒణికింది
కళ్ళు
మేడలో నీడలు
ఆలోచన ఒక యజ్ఞం
అర్ధ చంద్ర
ఈ దేశం లో ఒక భాగమిది
జాలి లేని జాబిలి
నెత్తుటి బొట్టు
న్యాయానికి అటూ ఇటూ
పసుపు కుంకుమ
ప్రేమ నక్షత్రం
ఊగవే ఉయ్యాల
విరాజి
సౌందర్యం
ఈయన 2004 అక్టోబరు 31 తేదీన పరమపదించాడు.
ఆయనకు నివాళి