ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రయాణం :---డా.కె .ఎల్ .వి.ప్రసాద్ ,--హనంకొండ.
November 22, 2020 • T. VEDANTA SURY • Poem

వయసులో ఉన్నప్పుడు,
ప్రయాణం చేయాలంటే ,
మనసు ఉవ్విళ్ళూరుతుండేది 
ఎప్పుడు సమయం ...
కుదురుతుందా ..అని,
ఆత్రంగా ఎదురు చూసేది !

బస్సు అయినా ..
రిజర్వేషన్ లేని ,
రైలు ప్రయాణం అయినా,
లెక్కచేసింది లేదు ఎప్పుడూ ...!

సీటు దొరికినా ...
దొరక్కపోయినా,
ప్రయాణం ...
హాయిగా సాగిపోయేది,
అందులో ...
ఆనందం నిండి  ఉండేది !

యౌవనం అడుగంటి,
వృద్దాప్యం చిగురించి,
శరీరం ...
అరిగిపోయిన యంత్రమైంది ,
ప్రయాణం అంటేనే ...
భయం మొదలయింది !

ఇప్పుడు ...
ప్రయాణించాలంటే ,
ప్రయారిటీలు వెతుక్కోవాలి,
అత్యవసరం అయితేనే ..
ప్రయాణానికి పచ్చ జండా ..
అది కూడా ..ఏసీ ..కారో ..
రైల్లో రిజర్వ్ చేసిన ..
ఏసీ ..కంపార్టు మెంటో ..!

నిజం చెప్పాలంటే,
జనరల్ బోగీ లో లభించే,
సందడి ..సరదా కబుర్లు ,
రిజర్వ్ కంపార్ట్మెంట్ లో సాధ్యమా !

అందుకే ...
ఆ ..రోజులే వేరు సుమా ...
అవి ..మళ్లీ ..మళ్లీ ..
తిరిగి రావు సుమా ...!!