ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రసిద్ధ రచయిత్రి డా. పి. యశోదారెడ్డి (8.8.1929 - 7.10.2007): తల్లిదండ్రులు: సరస్వతమ్మ, కాశిరెడ్డి.--1947లో ప్రఖ్యాత చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి (పి.టి.రెడ్డి) ని పెళ్ళి చేసుకుంది. ఉస్మానియా నుంచి తెలుగు(1955), సంస్కృత(1962) భాషల్లో ఎం.ఎ. పూర్తిచేసింది. “తెలుగులో హరివంశములు” అనేఅంశం మీద పరిశోధన చేసి పిహెచ్.డి. పొందింది. 1955లో కోఠి మహిళాకళాశాలలో అధ్యాపకురాలిగా ప్రవేశించి, ఆ తర్వాత ఉస్మానియా తెలుగు శాఖలోఅధ్యాపకురాలిగా పనిచేసి 1989లో ఉద్యోగవిరమణ చేసింది. 1990ఫిబ్రవరినుండి1993 ఫిబ్రవరివరకుఅధికారభాషాసంఘంఅధ్యక్షురాలిగాపనిచేసింది.1976లో ఆగ్రా యూనివర్సిటీ వారు డి. లిట్. ప్రదానం చేశారు. పారిజాతాపహరణపర్యాలోచనం, ద్విపద వాంగ్మయం, భాగవత సుధ, ఎర్రాప్రగడ, కథా చరిత్ర,భారతంలో స్త్రీ మొదలైనవి ఈమె రచనలు. మా ఊరి ముచ్చట్లు (1973), ఎచ్చెమ్మ కథలు (1999), ధర్మశాల (2000) ఈమె ప్రచురించిన కథాసంపుటాలు.“ఉగాదికి ఉయ్యాల”, “భావిక” ఈమె కవితాసంపుటాలు. ఈమె రాసినకొన్నికథలను ఎన్నిక చేసి "ఉత్తమ కథలు” పేరుతో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు పుస్తకంగా ప్రచురించారు. యశోదారెడ్డి గారి జయంతి సందర్బంగా ఆమె రాసిన కథ మీ కోసం కాలం చెప్పిన తీర్పు తెలంగాణ కథ మహేందర్ రెడ్డి గారు 9959525955 చదివి వినిపిస్తున్నారు వినండి .
August 8, 2020 • T. VEDANTA SURY • Videos