ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రార్ధన--కె ఎస్ అనంతాచార్య
September 5, 2020 • T. VEDANTA SURY • Poem

గంట మోగగానే
చిన్నారులు
వరుసలో నిలబడి
కళ్ళు మూసుకొని
ముక్తకంఠంతో అలపించే గీతం
ధారణకు సూత్రధారణ
కోరికలను తీర్చుకొనేందుకు కొండంత పత్రి లేకున్నా
పాదాల చెంత వాలిపోవడం
భావాన్ని వ్యక్త పరచడానికి రేయింబవళ్లు చేసే
యోగ సాధన
లక్ష్యాన్ని ఏర్పరచుకొని
సంకల్ప బలంతో సాగి పోయే ప్రత్యేక విశ్వాసం
మనం చెప్పే మంత్రమేదైనా వ్యక్తిని
పరివర్తనా శక్తిగా
మార్చే మహానీయ భావన
ఆచారం 
వ్యవహారం కాదు
కుల మతాలతో సంబంధం లేకుండా
చిత్త శుద్ధితో సాగి
విశ్వచర్య లోంచి పొందే వినూతనోత్సహం
చేతులు జోడించి
సాగిల పడే యాంత్రిక
చర్య కాదు
అహంకారాన్ని తొలగించి తనకు తాను లొంగి పోవడమే
పరిశుద్ధ హృదయం
ఉదాత్త కార్యాచరణతో వ్యక్తి సమగ్ర మార్పుకు తొడుపడే హితకరి 
నీవే తప్ప ఇతః పరంబెరుగని
సంపూర్ణ శరణాగతి!
పెదాలు కదిలించడం కాదు
 అర్థ నిమీలిత నేత్రాలతో
స్వామి ముందు సాగిలపడటం