ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రియమైన నాన్న: - జగదీశ్ యామిజాల
November 4, 2020 • T. VEDANTA SURY • Poem
  • నేను ప్రేమించిన తొలి బంధం
    మీరే కదు నాన్నా!!
  • నేను చదివిన తొలి కవిత
    మీరే కదు నాన్నా!!
  • నేను నివసించిన ఆలయం
    మీరే కదు నాన్నా!!
  • కంటికి రెప్పలా
    నన్ను చూసుకున్న 
    మీ అభిమానం
    ప్రతీ క్షణమూ
    కళ్ళముందు కదలాడే 
    అందమైన దృశ్యమే
  • చేయి పట్టుకుని 
    నేను నడిచిన 
    దారి నిండా 
    మీ జ్ఞాపకాలే
  • మీరు నేర్పిన మాటలూ
    మీరు నేర్పిన పాఠాలూ
    నా పురోగతికి సోపానాలు
  • మీరిచ్చిన ధైర్యమే 
    నాకెప్పటికీ శ్రీరామరక్ష ....