ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రియమైన మొలక మిత్రులారా.జేజేలు.నా పేరు కల్వకోట వేంకట సంతోష బాబు.కరీంనగర్.నా పేరు పెద్ద గా ఉందా.ఐతే ఇక ముందు సంతోష్ మామయ్య.సరేనా.ఈరోజు మన తెలుగువారు అంతా గర్వించదగ్గ రోజు.సరిగ్గా ఈరోజు అంటే 21జూన్ 1991నాడు మన ప్రియతమ నేత స్వర్గీయ పాములపర్తి వేంకట నరసింహారావు గారు భారతదేశపు తొమ్మిదవ ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం ఢిల్లీలో చేశారు.ఆయన పేరు పొడుగ్గా ఉందా.ఐతే మనం పీవీ తాత అందాం ఏమంటారు.మన పీవీ తాత 1921సంవత్సరం జూన్ 28తేదీనాడు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు లక్నేపల్లి(వరంగల్ జిల్లా)లో జన్మించినారు.అంటే ఈ యేడాది ఆయన శత జయంతి ఏడు కదా.దానిని మనం అందరం పండుగ లా జరుపు కుందాం.ఏమంటారు.మళ్లీ రేపు కలుద్దాం.
June 21, 2020 • T. VEDANTA SURY • Serial