ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్రేరణా రథి!!-కె ఎస్ అనంతాచార్య.-- ఇదే మాట పదే పదే అంటానంటూ ముందుకురికి బానిసత్వాన్ని ఎదురించిన తిరుగుబాటు జెండా ఆవేశం కట్టలయి తెంచుకొని నిజాంను నిరసించిన రుద్రవీణ విద్రోహ శక్తులపై ఉరిమిన నిప్పుల మేఘం ఎముకలు కరిగిన రైతులకే రాజ్యo దక్కాలని గళమెత్తిన ఛందోరావం అక్షర మంటలను రగల్చడం కాదు భగ భగ మండే వేదిక నుండి పరాధీన మానవుని స్వాతంత్ర సురపురికి పంప రజాకార్ల రాళ్ళ దెబ్బలు తిన్న ఉక్కుసంకల్పం! ఆ చల్లని సముద్ర గర్భాన దాగిన బడబానలం ! ప్రణయాన్ని ప్రళయాన్ని పద్యం లో రంగరిoచిన గడుసువాడు నిరుపేదకు అన్నం పెట్టని పొలాన్ని కాల్చేయమని పిలుపిచ్చిన గాలిబ్ గీతం పద్యంతో ధైర్యం చెప్పి పాదాలలో చైతన్యం నింపి పోరాటానికి శంఖమూదిన ప్రేరణారథి దీవిలో విరిసిన పారిజాతాన్ని భువికి దింపి పాడిన ప్రేమగీతం వామనుడైనా త్రివిక్రముడై తెలంగాణా పోరాటన్నీ నడిపిన చోదకశక్తి చలిగాలి లోంచి చరుపులు చావుబతుకుల నుండి అక్షర తూనీరం సంధించిన పునర్ణవం ఒక్క దాశరథి చాలు సప్త సముద్ర శక్తిని ఏకం చేసి నిర్లక్షాన్ని ఎదిరించ డానికి అక్షర తుపాకులు అన్యాయం పై పేల్చటానికి ( మహాకవి దాశరథి పుట్టినరోజు సందర్భంగా)
July 23, 2020 • T. VEDANTA SURY • Poem