ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్లాస్టిక్కును ,తరిమేద్దాం ....--డా. కె.ఎల్.వి.ప్రసాద్,హనంకొండ,వరంగల్.9866252002*--8886991785
October 3, 2020 • T. VEDANTA SURY • Poem

పప్పులు ..ఉప్పులు ,
తెచ్చుకోండి 
కాగితం కవర్లలో ..

కూరగాయలకోసం ,
ఇతర వస్తువుల కోసం ,
బట్ట సంచియే నయం ,
నార సంచీ తో ..
లేదు అసలు భయం !

మాంసాహార ..
ఉత్పత్తులకోసం ,
తామర ఆకులు ..
అరటిఆకులు ...
ఉండనే వున్నాయ్ ,

పాలకోసం ..
పెరుగుకోసం ..
సీసాలు _గిన్నెలు,
మదిలో ...
మెదులుతూనే ఉంటాయ్ !

ప్లాస్టిక్కుని పక్కకు నెట్టి ,
ఉద్యమ రూపంలో ,
ప్రజలంతా సహకరిస్తే ,
ప్రభుత్వాల ఆలోచనలు ,
ఆచరణకు ...
అనుకూలిస్తాయ్ !
కాలుష్య నివారణలో ,
ఫలితాలను అధిగమిస్తాయ్ !!