ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు‌.
August 23, 2020 • T. VEDANTA SURY • Story

రాజు 8వ తరగతి చదువుతున్నాడు. ఈసారి అతని పుట్టినరోజు సెలవురోజున వచ్చింది. అందుకే ఆ పుట్టినరోజు వేడుకలకు దగ్గర బంధుమిత్రులను కొంతమందిని ఆహ్వానించి, గుర్తుండిపోయేలా జరపాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. ఆ పట్టణంలో ప్రముఖ ఉద్యానవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడుకలు ఉంటాయని, మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే అని ప్రకటించారు. ఆరోజు రానే వచ్చింది. ఎం ఆహ్వానితులు అక్కడికి చేరుకున్నారు. కొంతమంది రాలేకపోయారు. ఉదయం నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయి. వచ్చిన బంధుమిత్రుల పిల్లలు తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. పాటలు పాడి, పద్యాలు చదివి, నృత్యాలను ప్రదర్శిస్తూ, కథలను చెబుతూ ఇలా అనేక రూపాలలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వినోదాన్ని పంచే ఆటలను ఆడారు. మధ్యాహ్నం భోజన సమయానికి సమీపంలో ఉన్న హోటల్ నుంచి భోజన పదార్ధాలు వచ్చాయి. వాటిని చూడగానే రాజుకు కోపం వచ్చింది. "వద్దు నాన్నా ఆ విషం తినవద్దు." అన్నాడు. వాళ్ళ నాన్నకు మరింత కోపం వచ్చింది. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఖరీదైన హోటల్లో స్పెషల్స్ తెస్తే విషమంటాడా? వీడికెంత పొగరు? అనుకుంటాడు. రాజుపై మండిపడ్డాడు. ""నాన్నా! ప్లాస్టిక్ వాడకం మన ఆరోగ్యానికి హానికరం అని తెలియదా? ప్లాస్టిక్ కవర్లలో పెట్టినా పదార్థాలను తినడం వల్ల మనకు ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి. బాగా వేడిగా ఉన్న కూరలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇచ్చారు. దీనివల్ల వేడి పదార్థాలలో ప్లాస్టిక్ కరిగి, మనం తిన్నప్పుడు మన కడుపులోకి పోయి, మనకు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులు వస్తాయి." అన్నాడు రాజు. "ఒరేయ్ రాజూ! ఎప్పుడో ఒకసారి తినడం వల్ల ఏ జబ్బూ రాదురా! అన్నాడు రాజు వాళ్ళ నాన్న. అప్పుడు రాజు వాళ్ళ పిన్ని కూతురు సిరి కలుగజేసుకుని ఇలా అంది. "మన ప్రాణాంతకమైనది ఏదైనా అది ఒక్కసారి తిన్నా అది విషమేనండీ!" అన్నది. అప్పుడు సరస్వతి అనే మరో అమ్మాయి ఇలా అంది. "ఈ ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వాడి, పారేసి, చెత్తతో పాటు దాన్ని తగలబెడుతున్నారు. ఈ విష వాయువులను పీల్చడం వలన కూడా మనం ప్రాణాంతకమైన జబ్బులకు గురి అవుతున్నాం. అంతే కాదు. పశువులు తమ ఆహారంతో పాటు పొరపాటున ప్లాస్టిక్ కవర్లను మింగి చనిపోతున్నాయి. ఏ విధంగా చూసినా ఈ ప్లాస్టిక్ వలన నష్టాలే కానీ లాభాలు లేవు." అని. మరో అమ్మాయి శివాని ఇలా అంది. "మనందరం ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం. ప్లాస్టిక్ కవర్లే కాదు. ప్లాస్టిక్ తో  తయారైన ఏ వస్తువునూ కొనవద్దు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే ప్రమాదాలను గురించి అందరికీ చెబుదాం."అని. అలాగే అన్నారు అందరూ. రాజు వాళ్ళ నాన్న బంధు మిత్రులందరినీ మంచి హాటలుకి తీసుకెళ్ళాడు. అక్కడే అందరికీ భోజనాలు తినిపించాడు. మరికొంత సమయం ఆనందంగా గడిపాక కేక్ కటింగ్ అయింది. అందరూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాము తెచ్చిన బహుమతులను రాజుకు ఇచ్చారు. మరోసారి ఇలాంటి వేడుకలు జరుపుకునేటప్పుడు ఇండ్లలోనే కమ్మని వంటలు చేసి, తీసుకుని పోవాలని నిశ్చయించుకున్నాడు.