ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఫిట్స్ - డాక్టర్ . కందేపి రాణీ ప్రసాద్-- కంగారూ కొత్తగా తల్లి అయింది. బిడ్డ పుట్టింది. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నది. పొట్ట సంచి లో కూర్చోబెట్టి షికారు తీసుకుని వెళుతున్నది. ఒకరోజు బుల్లి కంగారూ అకస్మాత్తుగా మాట పలుకు లేకుండా పడిపోయింది. నోట్లోంచి నురుగులు వస్తున్నాయి. కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నాయి.కంగారూ బాగా కంగారు పడింది. వెంటనే దగ్గర్లో ఉన్న సృజన్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళింది. డాక్టర్ గారు పరీక్షించారు. ""బిడ్డకు ఫిట్స్ వచ్చాయి.మందులు వాడాలి. వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. మందులు జాగ్రత్తగా వాడండి.నెలకోసారి నాకు చూపించు""అని చెప్పారు డాక్టర్ ప్రసాదరావు గారు. కంగారూ "" ఇంకేమి భయం లేదు కదా ""అని అడిగిందిడాక్టర్ గారిని.""క్రమం తప్పక మందులు వాడితే ప్రమాదం వుండదు. ప్రతిరోజూ ఈ మందులు వేసుకోవాలి'' అన్నారు డాక్టర్ గారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది కంగారూ. జాగ్రత్తగా బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళింది. డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు తన స్నేహితులకు కూడా చెప్పింది.
June 23, 2020 • T. VEDANTA SURY • Story