ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బంధం..: ---మొహమ్మద్ అఫ్సర వలీషా-- ,ద్వారపూడి ,(తూ ,గో జి )
November 15, 2020 • T. VEDANTA SURY • Poem

చిన్నారులూ మీకు తెలుసా....

గురు శిష్యుల బంధం విడదీయరానిది ....

శిష్యుని పురోగతికి  
నాంది  పునాది గురువు...

అక్షరాభ్యాసానికి నిచ్చెన వేసి దారి చూపే 
నిజమైన కార్మికుడు గురువు...

ఆ దారి నే రహదారి గా చేసుకుని పైపైకి ఎదిగే వాడు శిష్యుడు ....

తన శిష్యుడు ఆకాశం అంత  ఎత్తుకు ఎదగాలనుకుంటాడు గురువు....

శిష్యుని జీవితాన్ని  మలుపు తిప్పేది గురువు 
గురువు లేనిదే శిష్యుడు లేడు..

సమాజానికి వెలుగులు అందించేది గురువు 
ఆ వెలుగు లోని విజ్ఞాన జ్యోతులను ఆస్వాదించేది శిష్యుడు...

సన్మార్గంలో నడిపించే వాడు గురువు
అంకిత భావం అచంచల విశ్వాసంతో శిష్యుడు.....

సృష్టి స్థితి లయ ల నిర్దేశకుడు గురువు 
శ్రద్ధ లేనిదే చైతన్యపు పరమేన్నత స్థాయిని చేరలేడు శిష్యుడు ....

శిష్యుని జీవితానికి దిక్సూచి గురువు 

ఎగిరే గాలి పటం శిష్యుడు
దానికి ఆధారం గురువు....

గురువు లేని విద్య
భవిష్యత్తు మిధ్య 

ప్రతి గురువు ఒక సర్వే పల్లి రాధా కృష్ణన్ అవ్వాలి
ప్రతి విద్యార్థి ఒక అబ్దుల్ కలాం ఆజాద్ అవ్వాలి...

ప్రగతి పూరిత సమాజం మనము పొందాలి 
గురు శిష్యుల మైత్రి చిరకాలం చిగురించాలి ....