ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బడిబాట గేయం: -సి. శేఖర్(సియస్సార్),తెలుగు భాషోపాద్యాయులు,పాలమూరు,9010480557.
September 21, 2020 • T. VEDANTA SURY • Poem

పల్లవి: 

ఛల్ ఛల్ ఛల్లంటూ
ర్రయ్ ర్రయ్ ర్రయ్యంటూ
గువ్వలా ఎగురుతూ బడికి చేరాలి
నీ బతుకు గుడినే కట్టుకోవాలి

చరణం1.

బల్యమంత బడిలోనే పెరగనివ్వాలి
మంచిని నేర్పిస్తూ పోషించాలి
దేశాన పౌరుడిగా వెలుగవ్వాలి
పో...పో..పొమ్మంటూ
పద..పద..పదమంటూ
అమ్మనాన్నలు-అవ్వతాతలు
హద్దులు చెరిపేస్తూ
బుద్దులు నేర్పిస్తూ
ముద్దులు కురిపిస్తూ
బడికే పంపించూ..!!ఛల్..!!

చరణం2.

ఎగిరేటి పక్షిలాగా నీవు ఎదగాలి
మదిలోన మంచినే పెంచుకోవాలి
లోకాన అందరితో పంచంకోవాలి
రా..రా...రమ్మంటూ..
పద..పద..పదమంటూ..
అక్కాతమ్ముడు-అన్నాచెల్లెలు
ఒకటై రావాలి-బడికే చేరాలి
చదువే నేర్చాలి
బతుకే దిద్దాలి..!!ఛల్.. ఛల్!!