ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బడి బాట -- పూసాల సత్యనారాయణ హైదరాబాద్
September 23, 2020 • T. VEDANTA SURY • Poem

అమ్మా కల వచ్చిందమ్మా 
బడి నా  కొరకై ఎక్కి ఎక్కి ఏడ్చిందమ్మా

క్లాస్ రూం చిన్న బోయే
బెంచీలు నిదుర బోయే 
బడి వాకిటి బోసి బోయే 

అమ్మా కల వచ్చిందమ్మా 
బడి నా కొరకై ఎక్కి ఎక్కి ఏడ్చిందమ్మా

పో పొమ్మని కరోనా ను ఈడ్చి తన్నింది
 రా రమ్మని  ప్రియ మారగా నన్ను ఒడిలోకి పిల్చింది

మూలుగుతున్న యూనిఫాం ను వేసుకొమ్మన్నది
దుమ్ము పట్టిన షూస్ దులుపుకొమ్మనది
నడక మరచిన కాళ్ళను పరుగె త్త మన్నది 

అమ్మ కల వచ్చిందమ్మా 
బడి నా కొరకై ఎక్కి ఎక్కి ఏడ్చిందమ్మా 

ఇంకెందుకు ఆన్ లైన్ పా ఠా లు
సారం లేని చదువుల రసాలు

ఫోను లేని  పిల్లల  ఆత్మ హత్యలకా ?
కన్నీరు కార్చుతున్న తల్లిదండ్రుల కా?

చెంగు చెంగు న  రారండోయి
బడి బాటన పట్టండోయి.