ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బడి--సామల కిరణ్-సాకి-కరీంనగర్
September 10, 2020 • T. VEDANTA SURY • Poem

చదువులమ్మ గుడి
సంస్కారమిచ్చు తల్లిఒడి

బడి
జ్ఞానపంటనిచ్చు మడి
జీవితాన్ని దిద్దు సింగిడి

బడి
ఆనందాల సందడి
ఆత్మీయతల రాబడి

బతుకుదెరువునిచ్చు బంగారుబడి.....
కాన్వెంట్ చదువులొచ్చాక బరువయ్యి పాయే
చదువు నేర్చు బడిన చదువు "కొను"డాయే
అమ్మభాష పోయి ఆంగ్లభాష వచ్చే...
అ ఆ ఇ ఈ లు పోయి ABCDలు వచ్చే...
జ్ఞానస్పర్థ పోయి ఉద్యోగస్పర్థ వచ్చే....
ఏదేమైనా.......
బడిని బ్రతికిచ్చుకోవాలే.....
బడి బాగుపడితే భావిజీవితాలకి బాట పడుతుంది