ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బడి_ముచ్చట్లు-- సరోజ పోచమల్లు
September 22, 2020 • T. VEDANTA SURY • Memories

ఎనకట బల్లు సెట్ల కింద నడిపేది.బడికి వొవుడు అంటే పోరగాండ్లకు దండి దుఖఃమ్ అచ్చేది.అయ్య,అవ్వలు గొర్ర, గొర్ర ఇగ్గుక పోయి బల్లె కూసుండ వెట్టెటోళ్లు. అయిన గూడ పోరగాండ్లు  ఇనకుండా సేండ్ల పొంట,సెలుకల పొంట,గుట్టల పొంట ఎగవడి ఊరికెటోల్లు ఎవ్వలికి దొరకకుండా.ఇండ్లల్ల గుమ్ముళ్ళల్లా  జాక్కునేది.

ఇగ వశపోక పోరాగాండ్లను బల్లె సెప్పరాసి కూడా గుంజుక పోయి బల్లె కూసోవెట్టెటోళ్లు.
బడికి పోవుడంటే ఎందుకు గంత భయపడేది అంటే.ఎనకట నైతే పెద్ద బాలచిచ్చ(బాలశిక్ష),చిన్న బాల చిచ్చ సెప్పేది.గదైతే మత్తు గొట్టు సాధువాయే.ఎవరికి సక్కగ నోరు తిరగపోయేది.సదివించి యాధికుడా ఉండేది కాదు..
ఇగ పంతుళ్ళు సెప్పిన పాఠం అప్పజెప్పక పోయిన,బడికి సక్కగ రాకపోయున ఇగ సూడు పోరగాండ్లను కోదండం ఎక్కిచ్చుడు,గోడకుర్సీ ఎయించుడు, బాస్కీల్ తీపిచ్చుడు.కంక బద్దల తోని కొట్టుడు.

ఇగ కోదండం అయితే  కింద ముండ్లకంప వెట్టి జబ్బలకు తాడుకట్టి ఓ.సెట్టుకు ఎలాడ తీసేది.ఇగ కంక బద్దలతోని పిర్రల మీద సంపుతాంటే వావ్వో, వాయ్యో అని మొత్తుకునుడే. ఇగ గోడకుర్సీ ఎత్తే కాళ్ళు ఆగక కిందికి జారుతాంటే సెమటలు పట్టేది..బస్కీల్ తీత్తే నైతే ఇగ మల్ల పొద్దుగాల  కూసుందాం అంటే కూసో రాక పోయేది.గట్ల ఉండు.గందుకే పోరగాండ్లకు బడికి పోవుడంటే ఉచ్ఛవడేది.

ఇగ ఎనకట ఆడి పొలగాండ్లను సదివిపిచ్చుడు తక్కువనే.. ఐదేండ్ల,ఏడేండ్ల పొలగాండ్లకు లగ్గం సేసి పంపేది.ఇగ అత్తగారింటి కాడ సదువెక్కడిది.
ఏదో  కొద్దిగంతమంది కొద్దిగా ,కొద్దిగా సదివేది.

ఇగ బడికి వోయేటప్పుడు టప్పుడు చెక్కపలక లు కొండవోయేది.కొద్ది దినాల అయినంక మట్టి పలకలు అచ్చినయ్..ఇగ పలకలు మంచిగ వారన్నని ఆ పలకలకు నళ్లారం(నళ్ళాలం) బొగ్గు దంచి పెట్టేది.గప్పుడు బలపాలు కూడా లేవయ్యే సుద్దముక్కల తోని రాసుకునేది.అటెంక బలపాలు అచ్చినయ్..

ఇగ మనదాంట్ల బలపాలు తిన్నోళ్లు ఎంత మందో.అదేందో పాడుగాను బలపం  సూడంగనే తినబుద్ధి అయ్యేది.పర్ర, పర్ర నవులేది ఎవళ్లు సూడకముందు..గయ్యి అయితే మత్తు కమ్మ గుండేది గాని.కడుపుల నట్టల్ వడుతయ్ అని పెద్ధోళ్ళు బలపాలు తింటే పేర్ర (పేర్ల)వెట్టేది..

బల్లె ఎవలు మంచిగ సదివితే గాళ్లే పెబ్బ.
పొద్దుగాల బడికి వోంగ తలకాయ నిండా జీడీగింజల నూనె వెట్టుకొని మంచిగ దూసుకొని,మోకానికి ఇంత పౌడర్ ఏసుకొని పోయేది.ఇగ   బల్లె పంతుళ్ళు మగ పొలగాండ్లకు నెత్తిల పెంటరు సేతికి అందకుండ కొరిగిచ్చుకోమనేది.సేతికి గోళ్లు కూడా ఉండద్దు అని సెప్పేది.

ఎనకట పంతుళ్ళు ఎంత కొట్టిన కూడా గాళ్లు అంటే మత్తు  భక్తి తోని భయపడేది.బడి లేనపుడు ఏడ నన్న  ఆడుకోంగ పంతుళ్ళు కనవడితే సాలు ఎగవడి ఉరికి ఇంట్ల సొచ్చేది..

కొద్ది దినాలకు సర్కార్ బల్లె పగటి పూటకు గోధుమ రవ్వతోని సేసిన ఉక్మ వెట్టేది ఇగ అందరు బల్లె నే తిని ఉండాలని.లేదంటే పగటి పూట బడికి ఏడ తప్పిత్తరో అని గట్ల సేసేది.
ఇగ బడి పుత్తకాలు(పుస్తకాలు),వైలు, ఓ తట్టు సంచి కుట్టిచ్చుకొని గండ్ల వెట్టుకొని పోయేది..ఇగ సెట్టుకింద సాధువుడాయే.ముడ్డి కింద ఏసుకొని కూసోనికి కూడా ఓ తట్టు బొంత కొండవొయ్య కుకునేది.
సల్లటి గాలికి పాడుగాను పగటీలి కూరుపాట్లు అచ్చేది..
ఎంతైనా గా ఎనకట నే గమ్మతి ఉండేది..
S...N.