ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బస్సు (గేయం)-- అన్నాడి జ్యోతి. సిద్దిపేట
September 18, 2020 • T. VEDANTA SURY • Poem

ఊరు ఊరు తిరుగుకుంటు
ప్రతి ఊరును పలకరిస్తు
పల్లె పట్టణంబులనక
పయణించును ఆ బస్సు!!

చిన్న పెద్దలందరిని 
పదిలంగా తీసుకెళ్ళి
సమయానికి గమ్యానికి
చేర్చుతుంది ప్రతిబస్సు!!

తీర్థయాత్రలన్నింటికి
తీసుకెళ్ళు ఆ బస్సు
ఎండ,వాన తగులకుండ
భలే బాగు ఆ బస్సు!!

స్వచ్ఛమైన చల్లగాలి
కిటికినుండి వస్తుంటే
ప్రకృతి అందాలు చూస్తూ
పయణించుట హాయి హాయి!

       .