ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బహుముఖ ప్రజ్ఞాశాలి 'సర్వజ్ఞాత్ముడు..!'----సుజాత.పి.వి.ఎల్.
August 27, 2020 • T. VEDANTA SURY • Story

శంకరాచార్యులవారి శిష్యరత్నం సర్వజ్ఞాత్ముడు. శంకరుల కంటే ఈయన వయసులో చిన్నవాడు. కంచిలో అద్వైత పీఠాన్ని అధిరోహించిన తర్వాత శంకరులతో అనేక మంది పండితులు వాదించి ఓడిపోయి శిష్యులయ్యారు. అలాంటి వారిలో ఒకడు సర్వజ్ఞాత్ముడు.
తామ్ర పర్జీ నదీతీరంలో నివసించే మహాదేవుడు అనే మీమాంసకుని పుత్రుడు సర్వజ్ఞాత్ముడు. పన్నెండేళ్ల వయసులో శంకరులతో నాలుగురోజులతో పాటు వాదించి ఓడిపోయి శిష్యుడయ్యాడు. సన్యాసాన్ని కూడా స్వీకరించాడు. ఆదిశంకరుల తర్వాత అతనే కంచి మఠానికి అధిపతి అయ్యాడు. చిన్నవాడు కావడం వల్ల సురేశ్వరుని పర్యవేక్షణలో పెరిగాడు. సంక్షేప శారీరక భాష్యాన్ని, పంచప్రక్రియ ప్రమాణ లక్షణం అనే గ్రంథాల్ని సర్వజ్ఞాతుడు రచించాడు. సంక్షేప శారీరకాచార్యులు, సర్వజ్ఞాత్మ ముని, సర్వజ్ఞుడు అనే నామాంతరాలు ఈయనకి ఉన్నాయి. మంచి ప్రజ్ఞాశాలిగా శంకరుల నుంచి అభినందనలు అందుకున్నాడు సర్వజ్ఞుడు.