ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాంధవ్యాలు: --కె ఎస్ అనంతాచార్య
September 2, 2020 • T. VEDANTA SURY • Poem

తాండాలుగా ,సమూహాలు గా 
వసియించిన
ఆది మానవుడు 
ప్రకృతిలో మమేకమై
  విస్తరించాడు!
 క్రూరమృ గల పై పట్టు సాధించి
అడవిని జయించాడు!
 ఆధునికత మనిషిని ఏకాకిని చేసి ఎదుగుదలపై పంజా విసిరింది!
 అంతర్గత శక్తి  మిన్నంటిన ఉత్సాహం  తో  సింహ సదృశ  బలమై ఉప్పొంగుతుంది!
ఒంటరితనం ఒక భరించలేని అనుభవం కాదు
మంచి స్నేహితుడు తోడుంటే!
బంధువులు హితులు
సన్నిహితులే లేకుంటే
 పాండవులకు విజయం ఓనగూరేదా?
ఒక్క మహనీయుని మహితోక్తి
అణుశక్తి లా మనసును లక్ష్యం వైపుకు మళ్లిస్తుంది!
ఊత కర్రే  వార్ధక్యానికి తోడు
వారధి నిర్మాణంలో  ఉడుత సాయం
కూడా  రామాయణంలో ఊతమే!
కామ, క్రోధ, మోహబంధ త్రయాలు
దూరమైతే తప్ప మూర్తిమత్వo 
పూర్ణస్వర్ణ బాండమై భాసిల్లదు
బాంధవ్యాలన్నీ  మనిషికి  
అవసరాల్లో తోడు నిల్చే ఊతకర్రలే