ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాపూజీ(బాల గేయం)--అన్నాడి జ్యోతి --సిద్దిపేట.
October 2, 2020 • T. VEDANTA SURY • Poem

గుజరాత్ రాష్ట్రాన
పోరు బందరులోన
అక్టోబర్ రెండున అవతరించిండు
అతడే అతడేగాంధీజీ 
మనబాలల తాత బాపూజీ
బారిస్టరు మన బాపూజీ
 బోసి  నవ్వుల  బాపూజీ    
  స్వదేశీవస్త్రంసబబన్నాడు
విదేశీ వస్త్రం విడనాడు
నూలుతొ బట్టలు వడికాడు
అవియేధరించి కదిలాడు
బానిస బతుకులు మనకొద్దంటూ 
స్వాతంత్ర్యమే మన ధ్యేయమన్నాడు
అహింస మార్గం పాటించాడు
తెల్లవారిని తరలి పొమ్మంటూ 
క్విట్ ఇండియా అన్నాడు
బానిస బతుకుల విముక్తికోసం
నెహ్రూ ,శాస్త్రీ, పటేల్ లాంటి
పలువురి నేతల ప్రోద్బలముతో 
సమరం కొనసాగించాడు
స్వాతంత్ర్యం సాధించాడు
బాలల తాతకు జేజేలు
మన బాపూజీ కీ జేజేలు 
గాంధీ తాత కు జేజేలు‌!!