ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాపూజీ మొగ్గలు--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 2, 2020 • T. VEDANTA SURY • Poem

1) పోరుబందరున ప్రభవించిన
     సత్యాహింసలు ఔదలదాల్చిన
     బాపూజీ మాకు ఆదర్శం!
2) కొల్లాయిగట్టి కర్రచేతబట్టి
    చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించిన
    బాపూజీ మాకు అపురూపం!
3) సహనానికి నిలువెత్తు రూపంగా నిలిచి
    కాలాతీత సిధ్ధాంతాలను అనుసరించిన
    బాపూజీ మాకు అభిమానపురుషుడు!
4) మిత,అతి,ఉగ్రవాదాలను అంగీకరించక
     పరిమిత వాదంతో ఒప్పించిన
     బాపూజీ మాకు ఆప్తమిత్రుడు!
5) దాస్యశృంఖలాలను తెగనరికి
     మాతృభూమి ఋణం తీర్చుకున్న మా
     బాపూజీ మాకు ఋషివర్యుడు!