ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాబు మోహన్ తో మాట్లాడిన వేళ--కే సృజన్ సింధూర్
November 12, 2020 • T. VEDANTA SURY • Memories

హలో ఫ్రెండ్స్ నా పేరు సృజన సింధూర్ నేను ఐదో తరగతి చదువుతున్నాను మీ అనుభవాలు అన్ని చదువుతున్నాను మరి నా డైరీలో మరుపురాని రోజు గా రాసుకున్న సంఘటనను ఇప్పుడు మీకు చెబుతాను ఓసారి మేం హైదరాబాదు వెళ్ళాను అక్కడ మా డాడీ పనిమీద అసెంబ్లీ కి వెళ్తుంటే నేను కూడా వస్తాను అంటూ వెంట వెళ్ళాను నేను అక్కడ ఆసక్తిగా అన్నిటినీ గమనిస్తూ ఉన్నాను అంతలో ప్రముఖ హాస్య నటుడు శాసనసభ్యులు బాబు మోహన్ గారు అసెంబ్లీ లోకి వెళుతూ కనిపించారు ఆయన చూడగానే నాకు ఎంతో ఇష్టమైన మాయలోడు సినిమా గుర్తుకు వచ్చింది అందులోని బాబు మోహన్ గారి అస్తిపంజరం సీను చాలా నవ్విస్తుంది ఈ సినిమాను ఎన్నో సార్లు చూశాను టీవీలో చూసి నేనే కాదు మీరందరూ కూడా బాగా నవివ నేనెలా ఆలోచిస్తుండగానే మా డాడీ పక్కనున్న అంకుల్ నా కుతూహలాన్ని గమనించి నన్ను బాబుమోహన్ దగ్గరకు తీసుకు వెళ్లి పరిచయం చేశారు సినిమాల్లో లాగే చాలా హాస్యంగా మాట్లాడారు నేను అడిగిన వాటన్నిటికీ చాలా వివరంగా ఓపిగ్గా సమాధానాలు చెప్పారు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది బాబు మోహన్ తో మాట్లాడాను అంటూ డైరీలో నోట్ చేసుకున్నాను అంతేకాదు ఈ విషయం తర్వాత మా స్కూల్లో ని ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పినాను నా ఈ అనుభవాన్ని మీతో చెప్పే అవకాశం కల్పించిన  మొలక కు ధన్యవాదాలు