ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలలం::- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 16, 2020 • T. VEDANTA SURY • Poem

అన్నాదమ్ములమే - మేమంత
అక్కా చెల్లెళ్ళమే
బడిలోన చదివేటి బాలలమంతా
బావి భారత పౌరులం ||అన్నా||
కలిసే ఉంటామే - మేమంత
కలిసే చదువుతామూ
ఆడుతు పాడుతు కలిసిమెలుగుతూ
ప్రగతిని సాధిస్తాం ||అన్నా||
కులము చూడబోమూ - మేమంత
మతము చూడబోమూ
కులము మతము లేక సోదరభావంతో
కలిసే ఉంటామూ ||అన్నా||
మాలలోని పువ్వులం - మేమంత
భరతమాత బిడ్డలం
హిందూ ముస్లిం క్రైస్తవ జైన
అందమైన బాలలం ||అన్నా||