ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలలూ!చిన్నారులూ!: - పద్మ త్రిపురారి--జనగామ.
November 14, 2020 • T. VEDANTA SURY • Videos

పల్లవి::
చందమామకన్న అందమైన బాలలూ!
చిన్నారులూ!
చక్కనైన పూలవంటి పిల్లలూ!బుజ్జాయిలూ!

చరణం::

కొమ్మ మీది కోకిలమ్మ పలికెనూ.
  "మీకోసమే"   "2"
నీలిరంగు నెమలి నాట్యమాడెనూ.
   "మీకోసమే"  "2"
     
       "చందమామ"

కొండపైన జలపాతం దూకెనూ.
    "మీ పలుకులా" "2"
గలగలమని గంగమ్మ పారెనూ.
    "మీ మాటలా"  "2'

      "చందమామ"

చరరణం:

పచ్చనైన చెట్టు పరవశించెనూ.
  "మీ పాటలా""2"
స్వచ్ఛమైన గాలి ఇలా వీచెనూ.
     "మీ మనసులా" "2"

          "చందమామ"

చరణం::
లేడీకూన గంతులేసి ఎగిరెనూ
    "మీ ఆటలా"
లేత మనసు మీదేనని పలికెనూ.
""ఆ చిలుకలే'  "2"


    "చందమామ"

పాలవెల్లి మీద నురగ పొంగెనూ
   "మీ నవ్వులా"  "2"
పసిడి కాంతి దీపమై వెలిగెనూ.
      "మీ రూపులా"  "2"

        "చందమామకన్న"