ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలల వికాసం కొరకు బాల సాహిత్యం అవసరం
November 14, 2020 • T. VEDANTA SURY • News

బాలసాహిత్య రచనలతో బాలల వికాసానికి కృషి చేస్తున్న రచయితలు చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర మీడియా అకాడమీ సభ్యులు కొమురవెళ్ళి అంజయ్య అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో జరిగిన సమావేశంలో కొమురవెళ్ళి అంజయ్య మాట్లాడుతూ అన్ని సాహిత్య ప్రక్రియలలో బాలసాహిత్యానికి ఎంతో విశిష్టత ఉందని మంచి, నీతి, న్యాయం వైపు నడిచేలా రచనలు చేయడమే కాక బాలల స్థాయిలో ఆలోచించి రచనలు చేయడం గొప్ప విషయమన్నారు. మారుతున్న కాలానుగుణంగా ఆడియో, వీడియోలలో బాలసాహిత్యం అందాలన్నారు. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ బాలల మనస్సు మైనపు ముద్దలాంటిదని వారిని మంచి వైపు పయనింపజేసేలా రచనలుండాలని అన్నారు. సిద్దిపేటలో అధికంగా బాలసాహిత్య రచనలు రావడం, బాలలు సైతం రచనలు చేయడం శుభ పరిణామమన.నారు  కథల తాతయ్య ఎన్నవెళ్ళి రాజమౌళి మాట్లాడుతూ బాలలచే పుస్తక పఠనం చేయించాలని అందువల్ల బాల వివేకం అందుతుందని అన్నారు. సమావేశంలో బాలసాహిత్య రచయితలు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, యాడవరం చంద్రకాంత్, యు.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.