ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యంలో పరిశోధనలు జరగాలి - డా! వాసరవేణి పర్శరాములు--నేడు చిట్టిపొట్టి గేయాలతో, మంచి, నీతి, న్యాయం వైపు నడిపించే కథలు, పద్యాలు వివిధ ప్రక్రియలలో విస్తృతంగా వస్తున్న బాలసాహిత్య రచనలపై పరిశోధన జరగాలని సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన ప్రముఖ బాలసాహితీ వేత్త, బాలసాహిత్య పరిశోధకులు డా! వాసరవేణి పర్శరాములు అన్నారు. బాలసాహితీ వేత్త ఉండ్రాళ్ళ రాజేశం నివాసంలో రాజేశంతో కలిసి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో అద్బుతమైన బాలసాహిత్య రచనలు రావడంతో పాటుగా పాఠశాల విద్యార్థులతో రచనలు చేయించి బాల కవులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. బాలసాహిత్యంలో రచనలు చేయడం అదృష్టమని, బాలసాహిత్యం చిన్నారులకు అందేలా కృషి చేయాలన్నారు.
August 6, 2020 • T. VEDANTA SURY • News