ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---41 : శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 7013660252.
October 31, 2020 • T. VEDANTA SURY • Memories

తిరునగరి వేదాంత సూరిగారు కరీంనగర్ జిల్లాలో నుస్తులాపూర్  లో ప్రసన్న,  రామస్వామి దంపతులకు నవంబర్ 18 ,1955 లో జన్మించారు.  ఎం. ఏ పూర్తిచేసిన వీరు న్యాయశాస్త్రంలో  కూడా పట్టభద్రులయ్యారు. రచనా రంగంపై మక్కువతో జర్నలిజంలో డిప్లమా చేశారు. వార్త దినపత్రికలో గా పని చేశారు.  ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు. బాల్యంలో బాలసాహిత్యం తోడ్పడ కుంటే వారి మనస్సున ద్వేషం అసూయ అనే దుష్ప్రభావాలు పడే అవకాశం ఉండేది. అలా జరగకుండా బాలసాహిత్యం దోహదపడాలి అనే అభిప్రాయంతో ఉండేవారు. వేదాంత సూరిగారు బాలల కోసం అనేక రచనలు చేశారు. వృత్తిరీత్యా గతంలో “ బాల లోకం” మాస పత్రిక “ ఉదయం” దినపత్రికల్లో పిల్లలకోసం ప్రత్యేక శీర్షికలు తీసుకు వచ్చారు. అమ్మను పోగొట్టుకున్న తను అందరిలో అమ్మను చూసుకోవడం అలవాటు చేసుకున్నారు. అందుకే కృతజ్ఞతగా,  " అమ్మ   లోకం" పుస్తకం రాసారని అంటారు. వేదాంత సూరి “ అమ్మ లోకం ”  పుస్తకం మహోన్నతమైన అమ్మకు చంద్రునికో నూలుపోగు" అని అమ్మలందరికీ అందించారు. ఇంకా ఈయన పిల్లల కోసం రాసిన పుస్తకాలు--- జయహో పిల్లలు మీరు ఎలా ఉండాలి ?పిల్లల మనసులో ఏముందో తెలుసా?, అమ్మ లోకం, బొమ్మల సంక్షిప్త రామాయణం, వేదాంత సూరిగారిని  బాల సాహితీవేత్తగా నిలబెట్టాయి. వేదాంత సూరిగారు సుమారు 35 పుస్తకాల వరకు వ్రాసారు. అతని బాల్యంలో మూడవ ఏట న్యాయపతి రాఘవరావు గారు ఒడిలో కూర్చుని రేడియోలో పద్యం చదివాల. అప్పటినుంచి బాల సాహిత్యంపై అభిరుచి ఏర్పడింది. నాలుగైదు తరగతుల లోనే వేదాంత సూరిగారు రేడియోలకు కథలు, వ్యాసాలు రాసే వారు. పిల్లలకు ఒక బాలల పత్రిక ఉండాలనే కోరిక కలిగింది. 1982లో కరీంనగర్ నుంచి వెలువడిన " బాల లోకం" పత్రికకు సంపాదకత్వం వహించారు. తరువాత ఉదయంలో ఉద్యోగంలో చేరాక తనకు" ఉదయ  బాల" అనే పేజీ కేటాయించారు. అది   వారానికి ఒకసారి మాత్రమే వచ్చేది. అంతకుముందు పిల్లలకు ”బాలమిత్ర” "చందమామ”  మాత్రమే ఉండేవి. అవి కూడా నెలకోసారి వచ్చేవి.  అయితే " ఉదయబాల"   పత్రికను  వారానికి 
ఒకసారి తెచ్చి వేేదాంత సూరిగారు  విజయం సాధించారు. తొలిసారి పిల్లలకు ప్రతిరోజు  " మొగ్గ " శీర్షికతో రచనలు ఇవ్వాలని తలపెట్టారు. అందుకు సూరిగారికి బాధ్యతలు అప్పగించారు. అప్పుడు అతని చిన్నప్పటి కల నెరవేరింది అనుకున్నారు.  మొగ్గ  శీర్షిక. రోజూ ఇవ్వడం మామూలు విషయం కాదు అని కొందరు పెద్దలు అన్నారు . అయినా ఇది చాలా గొప్ప పని అని ఆశీర్వదించారు.  హిందీ,  ఆ తరువాత మిగతా పత్రికలు కూడా బాలసాహిత్యానికి పేజీలు కేటాయించారు. కానీ విజయవంతం చేయలేక పోయారు. తను  " వార్త " దినపత్రిక నుంచి బయటకు వచ్చాక  పిల్లల మాస పత్రిక " మొలక " మాసపత్రికను ప్రారంభించారు. అది ఏడేళ్లు పూర్తి చేసుకుంది. మొలక పత్రికను చూసిన గూగుల్ వాళ్ళు,  వేదాంత సూరి గారి గురించి ప్రతిరోజు మొలక ఆన్లైన్లో నిర్వహించడానికి అవకాశం కల్పించారు. ఇది ప్రారంభమై సరిగ్గా ఏడాది గడిచింది. వేదాంత సూరి రెండు పుస్తకాలు కన్నడలోకి అనువాదమయ్యాయి. 2015 లో ముంబై లో కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన వివిధ భాషా బాలల కవి సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాల తరఫున పాల్గొన్నారు. ప్రస్తుతం బాలసాహిత్యం లో  మిత్రులు శ్రేయోభిలాషులు సాహితీ వేత్తల అండదండలు వలన ముందుకు సాగు  తున్నారు. ( సశేషం )