ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---53(1)--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,--ఫోన్ : 7013660252.
November 22, 2020 • T. VEDANTA SURY • Memories

పుట్టగుంట సురేష్ కుమార్ ప్రముఖ బాలల సాహిత్య రచయిత. వీరు ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రం విజయవాడలో పుట్టగుంట సూర్య ప్రకాష్ రావు, రంగనాయకమ్మ గార్లకు 9 డిసెంబర్ 1960 లో జన్మించారు. వీరు ఎం. బి. ఏ, ఎం. ఏ ఇంగ్లీష్, ఎం.ఏ  ఫిలాసఫీ, ఎం. ఎస్ .సి సైకాలజీ, పి.జి.డి.పి ,డి.సి.ఇ   డిగ్రీలు కలిగియున్నారు.  బాల్యంలో ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లో సురేష్ కుమార్ గారు  ఎప్పుడూ  ఒక కథ  చెబుతుండేవారు. ఆ కథకు అంతం ఉండేది కాదు. ప్రతిరోజు స్కూల్లో విరామ సమయంలో, సాయంత్రం ఇంటి బయట అరుగు మీద కూర్చుని కథ చెబుతుండేవారు. ఆ కథలో హీరో తన లక్ష్యసాధన కోసం ఎన్నో సాహస కృత్యాలను చేస్తూ ఓ భయంకరమైన మాంత్రికుడు కల్పించే అవరోధాలను  వీరోచితంగా అధిగమిస్తూ పోతుంటాడు. ఈ కథను వినేందుకు ఎందరో మిత్రులు సురేష్ కుమార్ గారి చుట్టూ చేరి సంభ్రమాశ్చ ర్యాలతో కేరింతలు కొడుతూ వినేవారు. ఇలా  ఈకథ కొన్ని సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగింది. ఇంతకీ ఈ కథ పేరు ఏమిటంటే "చిత్ర విచిత్ర తాళం చెవి" ఈ కథే భవిష్యత్తులో పుట్టగుంట వారిని  ఓ రచయితగా మార్చివేస్తుందనీ , తనతో తమాషా  కథలు రాయిస్తుందని కలలో కూడా ఊహించలేదు. 1995 సంవత్సరం నుంచి పుట్టగంటివారు ఒక యానిమేషన్ సంస్థ ( హార్ట్ యానిమేషన్ సంస్థ) వారికి ఆంగ్లములో పజిల్స్ వ్రాస్తూ ఉండేవారు. వాటిలో అమెరికన్ పజిల్ అనే ఫీచర్ చందమామ (ఆంగ్లం)లో  ప్రచురిత మయ్యేది.  యానిమేషన్ సంస్థ వారికి వార్త దినపత్రికలో కొత్తగా ప్రవేశపెట్టిన " మొగ్గ " అనే పిల్లల పేజీకి ఫీచర్స్ అందించే అవకాశం దక్కింది. దాంతో  వారు పుట్టగుంట వారిని సంప్రదిస్తే పజిల్స్ తో కూడిన “ తికమక కథలు” అనే శీర్షికన అందజేశారు. ఇందులో "వింత లడ్డూలు" అనే వీరి  తొలి రచన అందజేయగా " మొగ్గలో  " ప్రచురించబడింది. ఆతరువాత పుట్టగుంటవారు "తమషాకథలు" పేరుతో మూడు కథలను వ్రాసి వార్త దినపత్రిక సంపాదకులను కలిసారు. ఆ సంపాదకులవారు " మొగ్గ" ఎడిటర్ వేదాంత సూరి గారికి పరిచయం చేశారు. వేదాంత సూరిగారు ఎంతో సంతోషంగా పుట్టగుంట వారి భుజం తట్టి " తమాషా కథలు" శీర్షికకు ఆమోద ముద్ర వేశారు. ఈ తమాషా కథలు ప్రతి ఆదివారం వచ్చేవి. అలా 11 సంవత్సరాలు నిర్విరామంగా 591 కథలు ప్రచురించ బడ్డాయి.  మహారాష్ట్ర ప్రభుత్వం తమాషా కథల్లో “బాబోయ్ పోలీసులు”, "చప్పట్లు కొట్టండి " అనే  కథలను ఎనిమిదవ తరగతి వాచకం" తెలుగు - సరళ భారతి" లోనూ మరియు” డాక్టర్ కుందేలు వైద్య రహస్యం” అనే కథను 6వ తరగతి  “ తెలుగు - బాల భారతి"  లోనూ పాఠ్యాంశాలుగా చోటు  చేసుకున్నాయి. 1998లో పుస్తకరూపంలో వచ్చిన ప్రభాస్ తమాషా కథలు 12 పునర్ముద్రణలతో లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి.బాలలకోసం కథలు రాస్తూనే మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్ మీద పుస్తకాలు రాస్తున్నారు. ( సశేషం )