ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం---53(2) --శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి ఫోన్ : 7013660252.
November 23, 2020 • T. VEDANTA SURY • Memories

పుట్టగుంట సురేష్ కుమార్ గారు అనేక ప్రక్రియల లో కొన్ని వందల కొద్ది రచనలు చేశారు. కథల పుస్తకాల విషయాని కొస్తే తమాషా కథలు, గమ్మత్తు కథలు, మొసలి కన్నీరు, నీ బలం గొప్పది? సురేష్ మామయ్య నీతి కథలు లాంటివి అనేకం రాశారు. ఇక నవలలు విషయానికొస్తే బాలల నవల " బబచి తాతయ్య ( తానా బాలల నవలల పోటీలో గెలుపొందిన నవల), అల్లరి చీమ అద్భుత యాత్ర నవలలు రాశారు. ఆహా ఓహో  ఇకిగాయ్ (త్వరలో విడుదల కాబోయే నవల ). వివిధ పత్రికలలో వీరు వ్రాసిన అనేక బాలల కథలు, బాల గేయాలు  ప్రచురితమయ్యాయి. ఆంగ్లములో ఎడ్యుకేషనల్ స్టోరీ బుక్, మ్యాజిక్ స్టిక్ పజిల్, అమెరికన్ పజిల్ అనే పుస్తకములు ప్రచురింపబడ్డాయి. ఆంగ్లము మరియు తెలుగు ( bilingual) పుస్తకములు కూడా వీరిచే వ్రాయబడినవి. అందులో కొన్ని పుస్తకాలు---
1.ఒక్క రోజులో ఇంగ్లీష్ 2. గడగడా ఇంగ్లీష్ 
3. ఫటాఫట్ వొకేబ్యూలరి 4. ఇంగ్లీషులో మీరే టాప్  5. నవ్వుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి 6. స్పోకెన్ ఇంగ్లీష్ కు అద్భుత పునాది 7. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యాలు. పుట్టగుంటవారు అనేక పురస్కారాలు పొందారు. 1 తమాషా కథల పుస్తకాని కి 2001లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి బాలసాహితీ పురస్కారం. 2. తమాషా కథల పుస్తకానికి 2017 లో  వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం. 3. "బబచి తాతయ్య తాతయ్యకు 2017 లో తానా  బాలల నవలల పోటీలో పది వేల రూపాయల నగదు బహుమతి పొందారు.4. మాతృభాష పరిరక్షణ సమితి 2018లో ప్రముఖ బాల సాహితీ వేత్త రెడ్డి రాఘవయ్య గారి బాల సాహిత్య పురస్కారం లభించింది. 5. బాలగోకులం వారిచే019లో “  బాల ప్రియ” బిరుదు ప్రధానం చేయబడింది. 
6. గోల్కొండ సాహితీ కళా సమితి వారిచే 2020లో 
 “  మణిపూసల కవిభూషణ ” బిరుదు ప్రధానం చేయబ డింది. ఇక పదవులు  విషయానికొస్తే బాల సాహిత్య పరిషత్తు మరియు తెలుగు బాలల రచయితల సంఘాలలో జాయింట్ సెక్రెటరీగా  వారు పని చేస్తున్నారు. బాలసాహి త్యానికి సేవ చేస్తే మానవాళికి మేలు చేసినట్లేనని పుట్టగుంట సురేష్ కుమార్ భావిస్తారు.  సశేషం )