ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం -34(2) -శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి--ఫోన్ 7013660252
October 15, 2020 • T. VEDANTA SURY • Memories

పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారి రచనలు విషయాని కొద్దాం. వీరు బాలల కోసమే కాక పెద్దలకు కూడా రచనలు చేసేవారు.బాలల కోసం కొన్ని వేల బాలగేయాలురచించారు.
ఈ బాల గేయాలు బాలల మాస పత్రికలైన ' బాల' 'చందమామ' లలో నిరంతరం ప్రచురింపబడేవి.బాలలకు అనేకమైన నవలలు కూడా రాశారు. ఈ  కథలను '' కథా సాగరం'' అనే పేరుతో సంకలనంగా ప్రచురించారు. " జీవన స్రవంతి" ఆత్మ కథను కూడా వ్రాశారు. వీరి రచనలు అనేక పత్రికలలో అంటే సౌభాగ్య, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, యువ,
జ్యోతి పత్రికలలో ప్రచురింపబడేవి. ఇవి కాకుండా ఇంకా ఇతర వార,  మాస పత్రికలలో ప్రచురింప బడేవి. " ఆడ చెత్త- మగ మాణిక్యాలు" అనే తన మూడవ కథ భారతి సాహిత్య మాస పత్రికలో ప్రచురింపబడింది. అయితే ఈ కథలో పాలంకి వారు మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఇచ్చిన సలహాను పాటించి చిన్న కథను వ్రాశారు. ఆ రోజులలో ఆంధ్రప్రభ ,సచిత్ర వార పత్రిక, ఆంధ్ర సచిత్ర వార పత్రికలు ఉండేవి. ఈ పత్రికలలో ఆయన  కథలు అనేకం ప్రచురించే వారు. ఈ కథలకు పాఠకులు నుండి అనేక అభినందనలు వచ్చేవి. పాలంకి వారిలో ఇంకా కథలు రాయాలనే తపన మెండుగా పెరిగింది. వీరి మాటల లోనూ, రచనలలోనూ హాస్య చతురత, వ్యంగ్య ధోరణి  అమితంగా కనిపించేది. తన రచనలలో కూడా ఎక్కడ ఏ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలిసిన నేర్పరి. వీరు రచయితలకు ఇచ్చిన సలహా ఏమిటంటే-- ప్రతి  రచయిత రెండు మంచిగుణాలు కలిగిఉండాలని చెప్పే వారు. అందులో మొదటిది మంచి రచయిత  కావాలంటే  రచయితకు నిరంతర పఠనం కావాలి. భాష మీద మంచి పట్టు సాధించాలి. రచయిత చేసే రచనలు పాఠకునికి హాస్యాన్ని పండించడమే  కాకుండా విజ్ఞానాన్ని కూడా కలిగించాలి .
వీరు రాసిన కథలలో పర్యాయపదములు  (సమానార్థక  పదములు ) అనేకం వాడేవారు .ఇతను బాలలకు అనేక మైన నవలలు రాశారు,  అందులో ముఖ్యమైనవి " బంగారు "చిరుకప్ప". చిరుకప్ప నవలలో ఒక అడవిలో గల  జంతువు లన్నీ ఒక బాలుని క్రమశిక్షణతో పెంచి సక్రమ మార్గంలో పెడతాయి. చందమామ, ఆంధ్రజ్యోతి  పత్రికలలో వీరి కథలు పుంఖాను  పుంఖాలుగా ప్రచురితమయ్యాయి . ఇంతలో ఆంధ్రజ్యోతి పత్రిక ఆగిపోయింది. రామచంద్రమూర్తి గారి రచనలు కూడా తగ్గిపోయాయి . కొద్దికాలం తరువాత పాలంకివారు కుటుంబంతో మైలాపూర్ నుండి త్యాగరాయ నగర్ కు  మారిపోయారు. త్యాగరాయ నగర్ ప్రక్క వీధిలో బి. నాగిరెడ్డి గారు నివసించేవారు. పాలంకి వారి కుమార్తెకు నాగిరెడ్డిగారి కుమార్తెకు స్నేహం ఏర్పడింది. ఒకనాటి రాత్రి పాలంకి వారి కుమార్తెను రెడ్డి గారి ఇంటి నుండి తీసుకురావ  డానికి వెళ్లారు. అక్కడ పాలంకివారికి  వెంకట సుబ్బారావు గారితో మొదటిసారిగా పరిచయం ఏర్పడింది. వెంకట సుబ్బారావు గారు అంటే మరెవరో కాదు. చందమామను నడిపిన " చక్రపాణి" గారే ! మాటల సందర్భంలో ఎవరెవరు ఏమిటో తెలుసుకున్న చక్రపాణిగారు పాలంకి వారిని చందమామ పత్రికకు కథలను వ్రాయమన్నారు . అలా అనడమే తడవుగా ఆ రాత్రికి రాత్రే పాలంకి వారు 
" బ్రహ్మరాత " అనే పేరుతో ఒక కథను వ్రాసి మరుసటి దినం చక్రపాణిగారికి అందించడం జరిగింది. ఆ కథను చదివిన చక్రపాణిగారు కథ హాస్య పూరితంగా ఉంది . మరిన్ని కథలను వ్రాసి పంపండి అన్నారు. అప్పటినుండి పాలంకి వారు చందమామలో అనేక కథలు రాశారు. తరువాత నండూరి రామమోహనరావు గారు ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో ఉన్నప్పుడు పాలంకి వారు వ్రాసిన 30కి పైగా కథలు ప్రచురించారు. ఈ కథలో కొన్నింటిని " సత్ కథాలహరి''  అనే పేరుతో త్రివేణి ప్రచురణ సంస్థ ఒక సంపుటిగా వేశారు. ఆ పుస్తకానికి పీఠికను చింతా దీక్షితులు గారు వ్రాశారు. బంగారు తల్లి  అనే నవలకు ఆంధ్రజ్యోతి "బాల సాహిత్యం " పోటీలో బహుమతి గెలిచి ధారావాహికంగా వచ్చింది. పాలంకి వారు రాసిన" వింత బీరువాలు,'' " నేతి రొట్టెలు",      "పండుగ బట్టలుఅనే పేరుతో దేశి కవితా మండలి వారు మూడు సంపుటాలుగా కథలను ప్రచురించారు.బాలజ్యోతి అనే పత్రికలో " సోమరాజు వివాహం"  అనే నవలను ధారావాహికంగా ప్రచురించారు. బాల సాహిత్య  రచనకు పాలంకి వారిని ప్రోత్సహించిన  కె. సభ అనే ఆయన మద్రాసులో విద్వాన్ విశ్వంతో పరిచయ  కల్పించారు. విశ్వంగారు   "చిరుకప్ప" నవలను పుస్తకరూపంలో తీసుకు  వచ్చారు . చందమామలో 300 కథలు పైబడి వ్రాసారు. రేడియో నాటికల సంఖ్య 200 పైబడి ఉన్నాయి. 
బాల్యం నుండే పిల్లలకు పురాణాలలో పరిచయం కలగాలన్న ఉద్దేశంతో పాలంకివారు బాలసాహి త్యంగా భారత, భాగవత, రామాయణాలు రాశారు. పాలంకి వారు బాలసాహిత్య రచయిత లకు ఇచ్చిన సలహా ఏమిటంటే కథ వ్రాసేటప్పుడు హాస్య ప్రధానంగా ఉండాలి. కథను సాగదీయ కూడదు. సంక్షిప్తంగా ఉండాలి. సంభాషణలకు  ప్రాధాన్యమి వ్వాలి. కథను చదవడం వల్ల బాలల లో భాషాజ్ఞానం పెంపొందాలి. రచయిత చెప్పదలచిన నీతిగానీ, సందేశం గాని బాలలకు స్పురించా లి.1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలంకి వారు హైదరాబాద్ ఉద్యోగరీత్యా వచ్చేసా రు.  అక్కడికి వచ్చిన తర్వాత దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రిగారితోనూ,"సౌభాగ్య" పత్రిక సంపాదకు లు  కళ్యాణ్ సింగ్ తోనూ కలసిమెలసిఉండేవారు. రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు ,  రేడియో అక్కయ్య కామేశ్వరి, అయ్యగారి వీరభద్ర రావు,మునిమాణిక్యం నరసింహారావు,పాలగుమ్మి  విశ్వనాథం, చిత్తరంజన్, బాలాంత్రపు రజనీకాంత రావు మొదలగువారితో పరిచయాలుఏర్పడ్డాయి . ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిచే బాలబంధు బిరుదుతో  సత్కారింపబడ్డారు. పాలంకి వారు పుట్టుకతో హిందువుల అయినప్పటికీ అన్ని మతాల వారిని అభిమానించేవారు. పాలంకి వెంకట రామచంద్ర  మూర్తి గారు తన 96వ యేట 2005 ఫిబ్రవరి 18వ తేదీన స్వర్గస్తులయ్యారు.( సశేషం )