ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం--39 (2): శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 7013660252.
October 27, 2020 • T. VEDANTA SURY • Memories

బుడ్డిగ సుబ్బరాయన్ " ఆంధ్రప్రదేశ్ దర్శన్" పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు 1979 లో బాలల అకాడమీ చేపట్టిన మొట్టమొదటి బాల సాహిత్య కార్యక్రమం --- అనేకమంది రచయితలు వ్రాసిన నాటికల  సంకలనాన్ని న్యాయపతి రాఘవరావుగారి ఆధ్వర్యంలో “పసిడి తెరలు” అనే శీర్షికతో తీసుకువచ్చారు.వివిధ నృత్య నాటికలను " చిరు గజ్జెలు" అనే శీర్షికతో ఏడిద కామేశ్వరరావుగారు సంకలనంగా తెచ్చారు. వేజెండ్ల సాంబశివరావుగారి ఆధ్వర్యంలో “ బడాయి మేక”  అనే శీర్షికతో గేయ కథల సంకలనాన్ని తెచ్చారు. కవిరావుగారి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తుల జీవిత సంగ్రహాలను" వెలుగు బాటలు" గా తెచ్చారు. "అనగా అనగా" అనే పిల్లల కథల సంకలనాన్ని మండ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలోనూ " గోడమీద బొమ్మ" తెలుగు కథలను వెలగా వెంకటప్పయ్యగారి ఆధ్వర్యంలో తీసుకువచపిల్లలకు  విపుల, చతుర మాస పత్రికలకు సహాయ సంపాదకుడిగా పని చేస్తున్న బాలల సాహిత్య రచయిత  చొక్కాపు వెంకట రమణ గారిని గుర్తించి సుబ్బరాయన్ ఆయనను పిలచి ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీలో “ బాల చంద్రిక” అనే పిల్లల పత్రిక, పిల్లల పుస్తక ప్రచురణల విభాగం సంపాదక బాధ్యతలు అప్పజెప్పారు. బాలచంద్రికను 40వేల పాఠశాలలకు అందేలాసుబ్బరాయన్ ఏర్పాటు చేశారు.  సుబ్బరాయన్ గారు ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ  పిల్లల పుస్తకాల విభాగం ద్వారా 8 ఏళ్లలోపు పిల్లలకు, 8 నుండి పదకొండేళ్ల మధ్య వయస్సు గల వారికి, 12 ఏళ్లు పైబడిన వారికి పుస్తకాలను ప్రచురించేవారు. బుడ్డిగ సుబ్బరాయన్ ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ఆధ్వర్యంలో  " ప్రతీ బడికీ బాల సరస్వతీ పీఠం"
అనే పథకం రూపొందించి రాష్ట్రంలోని 5000 పాఠశాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో బాలల దినోత్సవం నాడు" బాలల దినోత్సవ సప్తాహం" పేర సుబ్బరాయన్  ఉత్సవాలను   నిర్వహించేవారు.1986 లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా " పప్పెట్ కన్వెన్షనల్ ఫెస్టివల్ " నిర్వహించిన వ్యక్తి  బుడ్డిగ సుబ్బరాయన్. 1992 నుండి 2006 వరకు సుబ్బరాయన్ గారు ఆంధ్ర మహిళా సభ - సాక్షరతా భవన్ విభాగానికి గౌరవ కార్యదర్శిగా పని చేశారు.వయోజనుల కోసం అనేక పుస్తకాలు ప్రచురించారు. తెలుగు కంప్యూటర్ అభివృద్ధి బృందాన్ని తయారు చేసి తద్వారా భారతీయ భాషలలో సుబ్బరాయన్ కంప్యూటర్ అప్లికేషన్ ను తయారుచేశారు. " సొసైటీ ఫర్ కంప్యూటర్ అప్లికేషన్స్  ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ " కు ఉపాధ్యక్షు లుగా సుబ్బరాయన్ పనిచేశారు. ఇలా అనేక కార్యక్రమా లను నిర్వహించి యువతకు దేశానికి సేవలందించారు. జిరాక్స్ యంత్రం గురించి, డెస్క్ టాప్ పరికరం గురించి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పరిచయం చేసిన వ్యక్తి సుబ్బరాయన్ మాత్రమే. ఇలా చెప్పుకు పోవాలంటే ఇతను చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. సుబ్బరాయన్ 
1979లో భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారిచే సన్మానింపబడ్డారు.  జాషువాలిటరసీ,  గాడిచర్ల లిటరసీ, ఎన్.జి.రంగా లిటరసీ అవార్డులను అందుకున్నారు. 2005లో సి.పి.బ్రౌన్ స్మారక పురస్కారం డాక్టర్  ఎన్. మంగాదేవి బాలసాహిత్య పురస్కారం ఇలా ఎన్నో ఎన్నో అవార్డులు సుబ్బరాయన్ గారు అందుకున్నారు.కంప్యూటర్ విద్యా సాహిత్య రంగాలలో అభివృద్ధికి కృషి చేసిన సుబ్బరాయన్ 2007 సెప్టెంబరు 29న స్వర్గస్తు లయ్యారు. ( సశేషం )