ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలసాహిత్యం--43(1)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,-- ఫోన్ : 7013660252.
November 4, 2020 • T. VEDANTA SURY • Memories

రచయిత దాసరి వెంకటరమణ గారు 22 మార్చి1965న కర్నూలుజిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో  వెంకటరమణమ్మ, రంగయ్య దంపతులకు జన్మించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల హైదరాబాదు  లో చదివి బి ఏ తెలుగు లిటరేచర్ లో డిస్టింక్షన్ లో పాసై, కాలేజీ ఫస్ట్ గా  నిలచారు. ఎమ్.ఏ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ లో ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ పాసయ్యారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాల యంలో లఘు చిత్రాలకు  డైరెక్షన్ చేయడంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమాను డిస్టెన్స్ లో పాసయ్యారు. ప్రస్తుతం చందమామ కథలు -  బాలల వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నారు. 1987 నుండి 1995 వరకు పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణాభివృద్ధి అధికారిగా పోచంపల్లి , నల్గొండలో పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారిగా ఉద్యోగం చేస్తున్నారు. ఇతని యొక్క రచనలు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి, చతుర లాంటి ప్రముఖ పత్రికలలో 500 పైబడిన కథలు, కవితలు,  వ్యాసాలు ప్రచురితమ య్యాయి. దాసరి వెంకట రమణ గారు వ్రాసిన కథలు పుస్తక రూపంలో చాలా వచ్చాయి. అందులో ముఖ్యమైనవి, రచయితకు  మంచి పేరు తెచ్చిపెట్టినవి--- అమ్మ మనసు, ఆనందం. ఇంకా అతను రాసిన వాటిలో  పురాణ బాలలు, ఏది దానం, చేదు మాత్ర- పుస్తకాలను పిల్లలు చదువుకోవ డానికి వీలుగా ఉంటాయి. దాసరి వెంకటరమణగారు అనేక అనువాదాలు కూడా చేశారు. అందులో ముఖ్యమైన గ్రంథాలు -- తపస్సు, ఆకాశంలోకి -- అన్నవి. ( సశేషం )