ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాలుని ప్రశ్న నవ్వించే ఘర్షణ --పూసాల సత్యనారాయణ. హైదరాబాద్.
September 14, 2020 • T. VEDANTA SURY • Story

తాతయ్య  నీవంటే  నాకు చాలా ఇష్టం తాతయ్య.తెలియని విషయా లు ఎన్నోచెబుతుంటావు. 
ఇంకా ఏమైనా వుంటే అడుగు అన్నాడు. నాకు 8వ తరగతి లోనే. 6 పుస్తకాలు   6 నోట్  బుక్స్ వున్నాయి నా బ్యాగ్ మోయలేక పోతున్నాను మరి 50 వ తరగతి చదివే వాళ్లకు ఎన్ని వుంటాయి తాతయ్య. అని అమాయకంగా ప్రశ్నించాడు.  తాతయ్య  నవ్వుకున్నాడు  తరగతులు 10 వరకే.  వుంటాయి రా ఆతర్వాత కాలేజీలు.అవి ఇప్పుడెందుకు లే చిన్న పిల్లాడివి కదా చెబితే అర్థం కాదు.అన్నాడు. దేవుడి దగ్గర కొబ్బరి కాయనే ఎందుకు కొట్టాలి.? జామకాయ నో  మామిడి కాయ నో  ఉసిరి కాయనో ఎందుకు కొట్ట వద్దు ?         విరుగ బడి నవ్వు కున్నాడు.తాతయ్య   "కొబ్బరికాయ  స్వచ్చమైన నీల్లుంటాయి..అది దేవుడికి ఇష్టం..వేరే కాయ ఆయన ఇష్టపడడు.  దేవుడు తినేటప్పుడు నేను ఎప్పుడూ కూడా చూడలేదు తాతయ్య అందరం పోయిన తర్వాత తలుపులు వేసుకొని తింటా డా తాతయ్య.?    . ముసి ముసి గా నవ్వుతూ.  ఆయన తినేది నీకు కనబడదిరా   దేవుడు కదా  
మరి పోచమ్మ దగ్గర గొర్రెనే ఎందుకు కోస్తారు  ?  తాతయ్య    పులిని  సింహాన్ని  ఎందుకు  కొయ్యరు ? వాటికి పోచమ్మ భయ పడుతుందా ?     బిగ్గరగా నవ్వు కున్నాడు.  పోచమ్మ కు గోర్లు మేకలు  కోళ్లు ఇష్టం. నీకు చికెన్ ఇష్టం కదా అట్లగా .      ఒక్కటే అడుగుతా తాతయ్య.   దేవుడికి మాటలు రావా ? అంతా పసి పిల్లాడా  తాతయ్యా ఎప్పుడు గుడిలోనే వుంటాడు.ఆటలు కూడా ఆడు కోడు.
అంతటా. ఆయనే ఆడుతారు పాడుతారు. డాన్స్ కూడా చేస్తాడు.అది నీకు కనబడదు.వినబడదు. 
అయితే. ఆయనకే ఎందుకు మొక్కాలి ?   చెప్పు తాతయ్య.     రేపు చెబుతాను