ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల్యం-చెన్నమనేని ప్రేమసాగర్ రావు-- బాల్యమెంత సక్కనిది కమనీయపు కలగా మిగిలింది ఆనందంవచ్ఛినా ఆవేదన వచ్ఛినా అమ్మతో పంచుకునేది అడ్డంపడ్డా ,అమ్మకొట్టినా అమ్మపైబడి ఏడ్చేది బరువు దించుకునేది నాన్న బయటకెల్తుంటే నేను తనవెంటే చేనుకైనా ,చెలుకకైనా నామాటకు అంతవిలువ నేనంటే ఆంతప్రేమ ఒక పిప్పరమెంటిస్తే కళ్ళలోన ఒకమెరుపు చిరునవ్వుతో మోము వెలుగు చుట్టమెవరు వచ్ఛినా చిరుబహుమతి యిచ్ఛినా పట్టరాని ఆనందం వస్తువు విలువకాదు ఇచ్ఛినవారి ఆత్మీయత స్వచ్ఛమైన మనసుతోటి అచ్ఛమైన ఆనందం ఆస్వాదించిన బాల్యం మధురిమలు మరువలేము మన జీవితాన -!
July 25, 2020 • T. VEDANTA SURY • Poem