ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల్యం- సరోజ పోచమల్లు
September 3, 2020 • T. VEDANTA SURY • Poem

బాల్యం  
కల్మషం లేని మనసు
ఆట,పాటలతో
ఆనందంగా సాగే
బడి ప్రయాణం

చుట్టూ స్నేహితులతో
అంతరాలు,ఆడంబరాలు లేకుండా 
మది ఊసులు చెప్పుకుంటూ 
సాగే ఆనందడోలికల గమనం

కానీ ఇప్పుడు 
నాలుగు గోడల మద్యే
తన ప్రపంచం
చేతిలో బెత్తం లేని 
తన మనసే తన గురువు

చేతిలో ప్రపంచాన్ని చూస్తు
గడిపే ఏకాంత జీవితం
మనసు భావాలను 
పంచుకునే స్నేహం లేని ఒంటరి

చేతిలో సెల్ ఫోన్ ఒక్కటే 
ఇప్పుడు తనకు ఉన్న నేస్తం
సెల్ ఫోన్ ఒక మయాలోకం
ఆ మత్తు చెరసాలలో
బందీ అవుతున్న బాల్యం

ఆ సెల్ ఫోన్ లొనే 
బడి,పాఠాలు 
బోధించే బాద్యతే పంతులుది
శ్రద్ధగా వినే ఓపిక 
ఎంత మంది పిల్లలది.