ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల్యమంటే ఓబంగారు గని.: పోలయ్య కవి కూకట్లపల్లిహైదరాబాద్ - 9110784502
September 15, 2020 • T. VEDANTA SURY • Poem

బాల్యమంటే...
ఒక తీయనైన జ్ఞాపకాల పూలబుట్ట
కోటి కోర్కెల చెరగని చిరునవ్వుల చిట్ట
అమ్మానాన్నల కలలపుట్ట ఆశల ఆనకట్ట 

బాల్యమంటే...
ఒక పచ్చని చెట్టు
మధురమైన తేనె పట్టు
దాచుకున్న తీపి జ్ఞాపకాల గుట్టు
ప్రశాంతతకు నిలయమైన గుడి మెట్టు

బాల్యమంటే...
ఒక అల్లరి ఆట, కమ్మని పాట
ఒక మధురమైన మాట ముత్యాల మూట
ఒక బంగరు బాట గుబాళించే ఒక పూల తోట

బాల్యమంటే...
అంతులేని అమాయకత్వం
హద్దేలేని స్వేచ్ఛ, కల్లాకపటంలేని
మాయమర్మం ఎరుగని మరుమల్లెల మందార 
మకరంద భరిత మచ్చలేని ఓ స్వచ్చమైన జీవితం

బాల్యమంటే... 
ఎవరికైనా ఒక తీపి అనుభవం
వెనక్కి తిరిగి చూస్తే బాల్యంలోకి తొంగి చూస్తే 
ఎన్నెన్ని మధురమైన మరిచిపోలేని తీపిజ్ఞాపకాలో

బాల్యమంటే...
ఎక్కడం దిగడం, ఏడ్వడం నవ్వడం 
బాల్యం అంటే ఒక ఆశ, ఒక కమ్మని కల
తల్లిదండ్రులకు ఒక బరువు, ఒక బాధ్యత..........