ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల కవిత --ఎందుకిలా....: డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ .
November 14, 2020 • T. VEDANTA SURY • Poem

పిల్లలూ ..
ఈ  దీపావళికి 
గత దీపావళికీ 
తెలుసుకున్నారా 
తేడా ....
తెలుసు కోవాలి
తప్పక ...
లేకుంటే తప్పదు 
అనవసర బాధ !

స్వేచ్ఛగా...అప్పుడు 
చిచ్చు బుడ్లు-సిసింద్రీలు
చిటికెల పొట్లాలు -
కాకర పువ్వొత్తులు ,
మతాబాలు 
అనందంగా కాల్చామ్ ,
టపాకాయలు 
ఉత్సాహంగా పేల్చామ్ !

ఇప్పుడు ....
కరోనా మహమ్మారి 
పడగెత్తి ...
బుసకొడుతున్నది ,
కాటేయడానికి 
పలు మార్గాలు 
వెతుకుతున్నది ..!

దాని చూపంతా 
పిల్లలపై ..వృద్దులపై 
అమితంగా వున్నది .
అందుకే ---
అప్రమత్తం సుమా !

గుంపుల్లో తిరగొద్దు 
టపాసుల 
జోలికి వెళ్లొద్దు !

దీపాలదగ్గర 
శానిటైజరు వాడొద్దు !
ఈసారి -
ఇలా ఎందుకైందని '
బాధపడవద్దు !!
---------------------------------
ఫొటో లో....బేబీ..ఆన్షి.నల్లి.