ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల మకరందాలు:-ఉండ్రాళ్ళ రాజేశం --సిద్దిపేట
November 14, 2020 • T. VEDANTA SURY • Poem

పొత్తిళ్ళ నుండి వేరుబడ్డ పేగుబంధం
రక్త పాషానమై చెట్లపొదలలో ఊయాలలై
ప్రకృతి మాత జోల పాటల మకరందాన
బాటసారుల జీవగంజి పరుగుల రవళులై
ఒక్కో గూటి పక్షులన్ని గుడివద్ద, చెత్తకుప్పలందున నేస్తమై
నింగి నేలకు ఊహాల రెక్కలు కట్టుకుని
మట్టి  బంధాల మధ్య కుదిరిన కలబోతలతో
అక్షరకాంతులుగా నిత్య హరివిల్లులుగా
సమస్త మైత్రి సంపదలతో సాగేది బాల్యం
జగతిలో  వికసించిన బాల మకరందాలు
కల్మషం లేని పలుకుల పరవళ్ళలో
వివేకంతో రాసిన గీతలు విజయమైన వేళ
నడుస్తున్న నిలువెత్తు రూపముగా సాగుతూ
భావి భారత నిర్మాతలుగా సమాజ హితమై
భవిష్యత్ నవ నిర్మాణ నాంది ప్రస్థానం బాల్యం
విశ్వ జగతిలో ప్రాణికోటికి బాల్యం స్మరమీ
బాల వికాసంతో నైపుణ్య తరంగమై
అనుభవమే విజయ గీతికవుతుంది
బాల్యపు అంతరంగ వెలుగు పోరాట బావుటాలు
నవ వసంతపు విజ్జాన సౌధ నిర్మాణాలు