ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల వాక్కు! ----------------- అవార్డులకై అంగలార్చే వాడు సన్మానాలకై పరితపించే వాడు సత్కారాలకై ఎదురుచూసే వాడు పేరు కోసమై ప్రాకులాడే వాడు కాసుల కోసమై కక్కుర్తి పడే వాడు కీర్తి కండూతి కలవాడు విమర్శలను సహించలేని వాడు సలహాలను భరించలేని వాడు కుల జాడ్యం వదలని వాడు మత మౌడ్యం వీడని వాడు ప్రాంతీయ భేదం చూపించే వాడు ఆదర్శాలను పాటించని వాడు దేశాన్ని ప్రేమించని వాడు మనుషులతో స్నేహించనివాడు అన్ని కుల,మత, ప్రాంతాలను సమభావంతో చూడని వాడు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించని వాడు ప్రజా సమస్యలపై స్పందించని వాడు ప్రజా గళమై పల్లవించని వాడు ఉద్యమాలకు ఊపిరిలూదనివాడు శాంతి సామరస్యాలకై యత్నించని వాడు సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షించని వాడు ఉజ్వల భవిష్యత్తును ఊహించని వాడు అనైక్యతను ఛేదించని వాడు సమైక్యతను సాధించని వాడు విజ్ఞానమై వికసించని వాడు ప్రబోధమై పరిమళించని వాడు నిత్య చైతన్యమై ప్రభవించని వాడు మానవత్వమై ప్రవహించనివాడు కవి ఎలా అవుతాడు? ---బాలవర్ధిరాజు మల్లారం
June 24, 2020 • T. VEDANTA SURY • Poem