ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -15- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252
September 20, 2020 • T. VEDANTA SURY • Memories

1950 నుంచి బాల సాహిత్యమే లోకంగా రచయితలు ఆవిర్భవించారు.  వారిలో ముఖ్యంగా బి వి నరసింహారావు, కవిరావు, నార్ల చిరంజీవి మద్దులూరి సాంబశివరావు, ఏడిద కామేశ్వరరావు, న్యాయపతి రాఘవరావు, అలపర్తి వెంకట సుబ్బారావు, కలువకొలను సదానంద, మధురాంతకం రాజారామ్ మొదలగువారు ఉన్నారు. అలపర్తి వెంకట సుబ్బారావు, మధురాంతకం రాజారామ్ కలువ కొలను సదానంద ఈ ముగ్గురూ గ్రామీణ వాతావరణానికి చెందినవారు. వీరిలో అలపర్తి వారిది  ప్రత్యేకమైన జీవన విధానం. వారు ఏ విధమైన ఉద్యోగం చేయలేదు.60 సంవత్సరాలకు పైగా పల్లె వాతావరణంలోనే జీవించారు.
రచనలే ఇతని వ్యాపకం. కనీసం సభలు, సమావేశాలు, సత్కారాలు కనిపించరు.ఇతనికి రచనలుచేయడమందున్న ఆసక్తి తన జీవనం గురించి, బ్రతుకు గురించి అంతగా ఆలోచించే వారు కాదు. ఒకరి రచనలను కాపీ కొట్టడం, అనుకరణ చేయడం, భావానువాదం, బస్తీ పోకడలకు పోవడం పోవడం ఇతని జీవన విధానానికి బహుదూరం. మొట్టమొదటిసారిగా అనగా 1955లో అలపర్తి వారు 'బాలానందం' అనే గేయం సంకలనాన్ని ప్రచురించారు. 1960 నాటికి అలపర్తి వారు బాల సాహితీవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇతని చేసే రచన  లలో అధికంగా సామాజిక దృక్పదాన్ని కలిగి ఉంటాయి. ఇక కథల విషయానికొస్తే సమాజానికి నీతిని బోధించే విధంగా ఉంటాయి. 
సశేషం