ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -17--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్: 7013660252
September 22, 2020 • T. VEDANTA SURY • Memories

ఏడిదగారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్  బాలల అకాడమీ వారు పుస్తక ప్రచురణ చేయదలచారు.అలపర్తివారి రచనలను అన్నింటిని ప్రచురణ కొరకు పంపమని  తనను అడిగారు. ఏడిదవారు కోరిన వెంటనే అలపర్తి వారు తను రాసిన కథలు, గేయాలు,గేయకథలు, పద్యాలు, పద్యకథలు, నాటికలు, సంగీత నాటికలను ఎంపిక చేసి పంపియున్నారు. కానీ అలపర్తివారి రచనలలో కొన్నింటిని మాత్రమే " పాల వెన్నెల" పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. అనపర్తివారి మిగిలిన రచనలను కొన్నింటిని విడిచిపెట్టేశారు. ఆ కారణంగా అలపర్తి వారు చాలా బాధ పడ్డారు. ఇక్కడ మనము తెలుసుకోవలసిందేమిటంటే పుస్తక ప్రచురణకొరకు మన రచనలనుఇచ్చినప్పుడు  పుస్తకము తయారు అవ్వకముందే మనము పబ్లిషర్ కు ఇచ్చిన రచనలు అన్నీ ప్రచురింపబడ్డాయో లేదో ముందు గానే చూసుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ వారు 1991లో శ్రీయుతులు, ఏడిద కామేశ్వరరావు,మద్దులూరి రామకృష్ణ, కవిరావు, అలపర్తి. వెంకట సుబ్బారావు, వెలగా వెంకటప్పయ్య, వేజండ్ల సాంబ శివరావు గార్లకు " బాల బంధు" పురస్కారం ఒకే సారి  అందజేయబడింది. 1982 ఫిబ్రవరిలో దాశరథి చేతుల మీదుగా తెలుగు బాలల రచయితల సంఘంవారి పురస్కారం అందుకున్నారు.1996లో చింతాదీక్షితులు
గారి శతజయంతి సందర్భంగా సన్మానం. 1997లో  
'చక్రపాణి--కొలసాని'అవార్డును అందుకున్నారు.2003లో--
ఏభైయేళ్ళుగా బాలసాహిత్య రంగానికి విశేష కృషి చేస్తున్నందుకుగాను" తెలుగు బాలల రచయితల సంఘం"వారు సన్మానం చేసారు. 2004లో బాలల అకాడమీవారి పారితోషికాన్ని పొంది డాక్టర్.సి. నారాయణ రెడ్డి, అక్కినేని.నాగేశ్వరరావుగారి చేతుల మీదుగా  సన్మానింపబడ్డారు. అనేక రేడియో  కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలసాహిత్యంలో విశేష కృషి  చేసి బాలసా హిత్య రంగంలో చిరస్మరణీయంగా నిలచిపోయారు మన అలపర్తి వెంకటసుబ్బారావుగారు. ( సశేషం )