ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -21- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్: 7013660252.
September 27, 2020 • T. VEDANTA SURY • Memories

2012 డిసెంబరులో 27, 28, 29 తేదీలలో తిరుపతిలో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు సభలలో విడుదల చేసిన ప్రత్యేక సంచికలో బాల సాహిత్యం గురించి ప్రస్తావించడం జరిగింది. 
ఆచార్య ఎం. కె. దేవకిగారు, దాసరి వెంకటరమణ గారు రాసిన వ్యాసాలకు చోటు దక్కింది. ఆచార్య ఎం. కె. దేవకిగారు ఉద్దేశంలో " బాలబాలికల శ్రవణ పఠనాధులకు ఉద్దేశించబడిన  రచనలు బాల సాహిత్యం అవుతుంది" అంటారు. దేవకి గారు కూడా తెలుగులో బాల సాహిత్యం ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితంగా నిర్ణయించి చెప్పలేము అంటూ దాని పుట్టుక అతి ప్రాచీన కాలంలో  గేయ రూపంలో జరిగి ఉంటుందని చెప్పవచ్చన్నారు. ఆచార్య దేవకిగారి పరిశోధనలో  పాల్కురికి సోమన్న, వెన్నెలకంటి సూరన్న, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ధరణి దేవుల రామయ మంత్రి , అయ్యలరాజు  నారాయణామాత్యుడు, తాళ్లపాక కవుల రచనల్లో బాల గేయాల ప్రస్తావన  కనిపి  స్తుంది. పాల్కురికి సోమన్న, బెజ్జమహాదేవి కథలో  బాలసాహిత్యాన్ని ప్రధానంగా రెండు రకాలుగా విభజింపవచ్చని దేవకిగారు చెబుతారు.
 అవేమిటంటే 1. జానపద బాలగేయ సాహిత్యం 2. ఆధునిక బాలగేయ సాహిత్యం అని. 
జానపద బాలగేయ సాహిత్యం మారుమూల గ్రామాలలో, గ్రామాలలో నివసిస్తున్న నిరక్షరాస్యులైన జనులు అప్రయత్నంగా తీసే కూనిరాగాలు, వాటినుండి పాటలు పాడుతుంటారు. అటువంటి పాటలు
జానపద సాహిత్యంగా పేర్కొంటున్నారు. ఈ సాహిత్యములో పిల్లలకు సంబంధించి కథలు,  పాటలు, గేయాలు,గేయకథలు, పొడుపు కథలు,
మొదలైన ప్రక్రియలు ఉన్నాయని దేవకిగారు చెబుతున్నారు. ఇందులో లాలి పాటలు, జోల పాటలు ఉన్నాయని చెబుతూ ఉదాహరణగా---
" లాలి లాలోయమ్మ లాలి మాయమ్మా/ లాలి
ముద్దుల గుమ్మ బాలకృష్ణమ్మా--లాలీ// " నిద్రపో నా బాబు-- నిద్రపో నాన్నా/ నిద్రకూ నూరేళ్ళు--
నిద్రపో బలభద్ర-- రాజా కుమార/ నిన్ను కన్న తండ్రికి-- నిండు నూరేళ్లు//--జో అచ్యుతానంద--
జో జో ముకుంద/ లాలి పరమానంద-- రామ గోవింద//-- జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం/ గుర్రాల్ తిన్న ఎలక్కాయలరిగి/ అర్జునుడు తిన్న అరటి పండ్లరిగి/ అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి// అని తల్లి తన బిడ్డ ఆహారం తీసుకుంటు  న్నప్పుడు పాడుతుంది. ఇంకా మరో పాట చూడండి " ఏనుగు ఏనుగు నల్లన/ ఏనుగు కొమ్ములు తెల్లన/ ఏనుగు మీదా రాముడు/ ఎంతో చరచనలలో దేముడు// అని పాటలను ఉదహరించారు. అయితే ఈ పాటలన్నీ ప్రతీ బాల సాహిత్య రచయిత తాము రాసిన బాలసాహిత్య వ్యాసాలలో ఉదాహరణగా ఇచ్చుకున్న బాలగే యాలు మాత్రమే. ఈ గేయాలను ఎవరు ఎప్పుడు వ్రాసింది తెలియదు. ఒకరినుంచి మరొకరికి, మరొకరి నుంచి ఇంకొకరికి ఇలా  వారసత్వంగా ఈ గేయాలు వారి వారి రచనలలో రచయితలు సందర్భానుసారముగా చొప్పిస్తున్నారు. గానీ నూతనమైన బాల గేయాలు ఉదాహరణగా కనిపించకుండా ఉన్నాయి ( సశేషం )