ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -23-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,ఫోన్: 7013660252.
September 29, 2020 • T. VEDANTA SURY • Memories

డాక్టర్ గంగిశెట్టి శివ కుమార్, ప్రముఖ బాల సాహితీ వేత్త. నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఇతను చందమామ మాసపత్రికలో ఉప సంపాదకుడిగా పని చేశారు. రెండు వందల పైన పిల్లల కథలు రాశారు.  ఇప్పటికీ కూడా వారు వివిధ పత్రికలలో కథలను వ్రాస్తూనే ఉన్నారు.  తెలుగులో నర్సరీ గేయాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వీరి కథలను కొన్నింటిని పాఠ్యాంశా  లుగా ఎంచుకున్నారు.2004 జనవరి 12న జవహర్ బాల భవన్ వారిచే సన్మానం పొందారు. అంతేకాకుండా 2004 జనవరి 20న ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం వారిచే సన్మానింప బడ్డారు. ఇటీవల వరకు చాలా సంస్థలచే సన్మానింప బడుతూనే ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గంగిశెట్టి వారి సిద్ధాంత గ్రంథాన్ని ఆమోదించగా అతనికి పి హెచ్ డి దక్కింది.గంగిశెట్టి వారు 1 బాలసాహిత్య స్వరూప వికాసాలు 2 తెలుగు బాలల కథలు 3. బాలల  కథలు వర్గీకరణ 4. బాలల కథలు-- వివిధాం శాలు 4 భాగాల శీర్షికలతో బాల సాహిత్యానికి సంబం ధించిన అనేక విషయాలను పేర్కొన్నారు.  ప్రతీ సాహిత్య వేత్త ఈ గ్రంథాన్ని చదవవలసిందే ! '' బాలసాహిత్య స్వరూప వికాసాలు" శీర్షికన  బాల సాహిత్య స్వరూపం, బాలలు-- సాహిత్యావశ్య కత,  బాల సాహిత్యం--నిర్వచనం, బాలలు-- వయోపరిమితి గురించి సవివరంగా వివరించారు. గంగిశెట్టి వారు బాలల గురించి చెబుతూ .............
 " బాలలు పూలు, వెన్నెల, చందమామలతో పోల్చదగిన వారు. వెలకట్టలేని కళా సంపద, విలువ కట్టలేని తల్లి మనసుకు ప్రతి రూపాలు. చిరు ఊహల నిలయ లైనా ఆలోచనా దీపికలు" అని అంటారు. గంగిశెట్టి వారు తన గ్రంథంలో ప్రముఖ బాల సాహితీ వేత్త మద్దులూరి రామకృష్ణ గారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ" బాలసాహిత్య   పు    మూలధ్యేయం  బాలలలో సత్ప్రవర్తన కలిగించడం. వారిని మాతృభూమి ప్రేమించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం"  అని అంటారు. గంగిశెట్టివారు  బాలసాహిత్యాన్ని ఆరు విధాలుగా విభజించారు. ప్రథమ దశ శ్రవ్య సాహిత్యం. చిన్న చిన్న పదాలు కలిగిన పాటలు మూడు నాలుగేళ్ల పిల్లలను బాగా ఆకర్షిస్తాయి. అర్థం తెలియకపోయినా పిల్లలు ఆనందం పొందుతారు.అందుకు ఉదాహరణగా  " హాయి హాయి ఆపదలు గాయి/ చిన్న వాండ్రను గాయి   శ్రీ వెంకటేశా// అనే పాటనూ,  అలానే " చందమామ రావే జాబిల్లి రావే/ కొండెక్కి రావే గోగు పూలు తేవే !...// ఇలా సాగుతున్న పాటలను  ఉదాహరణగా ఇస్తారు గంగిశెట్టి వారు. ద్వితీయ దశ-- దృశ్య సాహిత్యం ఈ విషయంలో ఐదు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య గల బాల్యాన్ని ద్వితీయ దిశగా పరిగనించవచ్చు అనీ, ఈ దశలో పిల్లలకు భాషతో దగ్గర సంబంధం ఏర్పడుతుందని   అంటారు. ఆకర్షణీయమైన బొమ్మలతో ఉన్న జంతువులు, పక్షులు, వస్తువులు, వాహనాలు చెట్ల పేర్లను చెప్పగలుగు తారు. ఇక  తృతీయ దశలో పఠణ సాహిత్యం నేర్చుకుం టారు.పిల్లలు తమంత తామే అర్థం చేసుకోగల సాహిత్యం పఠణ సాహిత్యం అంటారు. ఈ దశలోనే పిల్లలకు వేమన శతకము, కుమారి శతకం, శతకాలు ఇలాంటివి  నేర్పుతారని గంగిశెట్టి చెబుతారు. ఉదాహరణకు......
" అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను/ సజ్జనుండు కలుపు చల్లగాను/ కంచు మ్రోగునట్లు కనకంబుమ్రోగునా/విశ్వదాభిరామ వినుర వేమ//
అలానే సుమతి శతకంలో ఒక పద్యాన్ని చూద్దాం.
" ఏరకుమీ కసుగాయాలు/  దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ / పారకుమీ రణమందున/  మీరకుమీ గురువులాజ్ఞ మదిలో సుమతీ !" అని గంగిశెట్టి ఉదాహరణగా ఇచ్చారు.
రచయిత ప్రాచీన దశలో నన్నె చోడకవి కుమారసంభవంలో పార్వతి బాల్య దశ అభివర్ణించే ఘట్టంలో ఆమె తన స్నేహితులతో ఆడుకునే సందర్భంలో "బొమ్మల పెళ్లి" ఆటను ప్రస్తావిస్తాడు. పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, తాళ్ళపాక కవులు, పింగళి సూరన, కొరవి గోపరాజు లాంటి కవులు బాల సాహిత్యా నికి చేసిన సేవలను గంగిశెట్టి వారు చెబుతారు. ఆధునిక బాలసాహిత్యారంభ దశ  గురించి చెబుతూ వీరేశలింగం పంతులుగారు చిన్న తరగతుల పిల్లలకు వాచక పుస్తకాలు కూడా రాశారని చెబుతారు  గంగిశెట్టివారు ఆధునిక కాలంలో కథలు శిల్పగతంగా నవ్యతను సాధించుకొని విశేష  ప్రాచుర్యాన్ని పొందాయనీ,తెలుగులో నన్నయ్యగారి భారతమే తొలి లిఖిత కథా సాహిత్యానికి ఉదాహరణ అని అంటారు. గంగిశెట్టి వారు తన సిద్ధాంత వ్యాసములో అనేకమంది రచయితల పేర్లను పేర్కొని, వారు బాలసాహిత్యానికి ఏ విధముగా సేవ చేసింది పేర్కొన్నారు. గంగిశెట్టి వారు బాలల కథలను ఈ క్రింది విధముగా వర్గీకరిస్తూ 1. బాలల జానపద కథలు 2 బాలల అద్భుత కథలు 3 పశుపక్ష్యా దులు పాత్రలుగా కలిగిన కథలు 4 నీతి కథలు 5 సాహస కథలు 6 వినోద కథలు 7 యుక్తి కథలు 8 సమస్యాత్మక కథలు 9 సామెత కథలు 10 చమత్కార కథలు అని పది విధాలైన కథలను నూతనంగా  కథలు రాసే బాలసాహిత్య  రచయి తలకు ఒక మార్గాన్ని చూపించారు. పైన నేను ఇచ్చిన సమాచారం అధికభాగం గంగిశెట్టివారి సిద్ధాంత గ్రంథం 
నుండి గ్రహించబడినది. వారికి  హృదయ పూర్వక కృతజ్ఞతలతో.......! ( సశేషం )