ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -25- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252.
October 1, 2020 • T. VEDANTA SURY • Memories

ఇటీవలే స్వర్గస్తులైన కలువ కొలను సదానంద వారి గూర్చి తెలుసుకుందాం. సదానందగారు ఉపాధ్యాయునిగా పని చేశారు. వీరు బాలలకు మంచి మంచి కథలను, నవలలను అందించారు. అంతేగాక చిత్రకళలోను వీరికి మంచి ప్రావీణ్యం ఉంది. ఇతను తన 18వ యేట నుంచే రచనలు చేయటం ప్రారంభించారు. చందమామ, బాల భారతి, బాలజ్యోతి,బాలమిత్ర, ఆంధ్ర పత్రిక, బాలజ్యోతి , బొమ్మరిల్లు, ఈనాడులో హాయ్ బుజ్జి హాయ్ లలో మొదలగు పత్రికలలో రాసి ఉన్నారు. వీరి రచనలలో విజ్ఞానం, వినోదం, ప్రభోదయం, హాస్యం, సందేశం లాంటివి అనేకం ఉంటాయి. ఈయన బాలసాహిత్యానికి ఎంతగానో కృషి చేశారు. కస్తూరి నరసింహ మూర్తి గారి గురించి తెలుసుకుందాం. ఈయన బాలల కోసం లెక్కలేని గేయాలు రాశారు. వీరు రాసిన పుస్తకాలలో ముఖ్యమైనవి బడికి దారి, బడి మెట్లు,పాపాయి సిరులు,కోయిలొచ్చింది// ప్రాథమిక విద్య నేర్చుకుంటున్న బాలలకు ఉపయుక్తమైనవి.  వీరి గేయాలు సందేశం, ప్రభోదం కలగలిసి ఉంటూ, విజ్ఞానాన్ని వినోదాన్ని  కలిగిస్తాయి. ఈ క్రింది గేయాన్ని చూడండి.“ మల్లె పూలు తెలుపు--జాజి పూలు తెలుపు  తోముకుంటే పళ్ళు--అంతకంటే తెలుపు" // అని అంటారు. వీరు  రాసిందే మరో గేయం చూడండి. " రామచిలుక పలుకు అందం/ రాజహంస నడక అందం/ పోతు నెమలి నటన అందం/ మంచి మనిషి గుణములందం"// అని బాలలకు అర్థమయ్యే రీతిలో చెబుతుంటారు. ఇతను కొన్ని నీతి వాక్యాలను బాలలకు సామెత  లుగా చెబుతూ " చెప్పుడు మాటలు విని చెడకు--
తప్పుడు మాటలు అని పడకు'' అంటారు. మరో బాలల సాహిత్య రచయిత కొప్పరపు ఆంజనే  యులు గారిని గురించి తెలుసుకుందాం. ఈయన ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. మంచి రచయితే కాకుండా కళాకారుడు  కూడాను. ఇతను గేయ, పద్య, కథా రచనలు చేసేవారు. బాలల కోసం ఎన్నో గేయాలు, కథలు,  పద్యాలు నాటకాలు అనేకం రాశారు. ఉదాహరణకు  ఇతను వ్రాసిన ఒక పద్యాన్ని  చూద్దాం. “అదుపులేని ఖర్చు - అప్పుల పాల్జేయు,  అప్పు హీనపరచు - అన్నిటందు/అప్పుచేసి కాలు- పప్పులో వేయకు, తేనె పలుకు లొలుకు-తెలుగు మొగ్గ!''// కొప్పరపు వారు రాసిన మరో పద్యాన్ని పరిశీలిద్దాం “ ఆశ లేనివాడు - అవనిలో లేడయ్య/ ఆశ మితము జేయ - కలుగు సుఖములు అంతులేని ఆశ ఆపద కలిగించు/ తెలుసుకొనుము వేగ తెలుగు మొగ్గ” // అని అంటారు. ఈ  రెండు పద్యము లలో నీతితో కూడుకున్న సందేశం ఉంది. జీవిత సత్యాన్ని పద్యరూపంలో బాలలకు అతి సులభ మైన పదాలతో తెలియజేశారు. ప్రతీ బాల సాహిత్య రచయిత తాము రచనలు చేసేటప్పుడు బాలల ఎదుగుదలకు, వారి భవిష్యత్ జీవితానికి సంబంధించే సందేశాలను బాలలకు అందజేసే  విధంగా ఉన్నాయి.( సశేషం )