ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -26- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,--ఫోన్: 7013660252.
October 2, 2020 • T. VEDANTA SURY • Memories

నేను బాల సాహిత్యం రంగానికి రావడం చాలా ఆలస్యమైంది. 2007లో బాలసాహిత్యం లోని అభిరుచులను తెలుసుకుని మొదటిలో గేయ రచన చేయడం మొదలు పెట్టాను. ఆ సందర్భంలోనే బాలప్రభ, వెన్నెల అనే బాల గేయాలు పుస్తకాలను ప్రచురించాను. అంతకు ముందు సంవత్సరం 2010లో ప్రముఖ బాల సాహితీ వేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి  రెడ్డి రాఘవయ్య గారితో పరిచయం ఏర్పడగా, మే 1, 2011 సంవత్సరంన ప్రముఖ బాల సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, బాలబంధు, గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారితో పరిచయం ఏర్పడింది. ఆ రోజున ప్రముఖ బాల సాహితీవేత్త  అయిన నారంశెట్టి  ఉమామహేశ్వ  రరావు గారు వ్రాసిన రెండో పుస్తకమైన “ వింత జలము ” పుస్తకావిష్కరణ వెలగా వెంకటప్పయ్య గారి చేతుల మీదుగా జరిగింది.  ఆ సభకు నలుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. వారిలో విజయ్ కుమార్ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, వీరబ్రహ్మయ్య విజయనగరం కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూడా ఉన్నారు. ఆ పుస్తకావిష్కరణ సభలో డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారితో బాల సాహిత్య వేత్తలు అంతా గ్రూప్ ఫోటో తీయించుకున్నారు.
వెలగా వారికి,నాకు అదే మొదటిసారి పరిచయం అవ్వడం. అయినా ఫోటో తీయించుకున్న సందర్భంలో తన ప్రక్కనే నిల్చో పెట్టుకున్నారు. నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. తన మనసు సున్నితమైనది, నిష్కళంకమైనది. బాలల మనసు పుణికి పుచ్చుకున్నట్లు అనిపించింది. అప్పటి నుండి మెల్లగా వారికి నాకు పరిచయం రాను రాను అధికమయ్యింది. 2014 జూన్ 12న విజయనగరం జిల్లా తోటపల్లి, పార్వతీపురం మండలంలో 50 గ్రామీణ గ్రంథాలయాల స్థాపన జరిగింది. అదే సందర్భంలో డాక్టర్ వెలగా వారి
83వ జన్మదిన ప్రత్యేక సంచిక విడుదల చేయ బడింది. అందులో నాతో సహా 30 మంది ప్రముఖ బాల సాహితీవేత్తలు వెలగావారి ఔన్నత్యాన్ని తెలుపుతూ అనేక విషయాలు వ్రాయడం జరిగింది. వెలగావారు గ్రంథాలయాల స్థాపనకు విశేషమైన కృషి చేశారు. గ్రంథాలయోద్యమంలో వెలగావారు చేసిన  కృషికి గుర్తింపుగా గుంటూరు లో ఒక వీధికి " డాక్టర్ వెలగా వెంకటప్పయ్య" వీధి అని నామకరణం చేశారు. గ్రంథాలయ పితా
మహుడు అయిన అయ్యంకి వెంకట రమణయ్య గారు తన గ్రంథాలయ సర్వస్వాన్ని వీరికి అప్పగించి తన వారసునిగా చేసుకున్నారు. ఇక జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి గారు వీరిని గ్రంథాలయ గాంధీ అనే బిరుదుతో గౌరవించారు.వెలగావారి రచనలను ఎన్నింటినో గ్రంథాలయ శాస్త్ర విద్యార్థుల డిగ్రీ పరీక్షలకు, స్నాతకోత్తర పరీక్షలకు పాఠ్యాంశాలుగా చేశారు. వెలగా వెంకటప్పయ్య గారు గ్రంథాలయాల పరిరక్షకులుగా ఉంటూనే  అనేక గ్రంధాలను చదివి జ్ఞాన  సంపన్నులు అయ్యారు. అందుకే బాలబంధు ఏడిద కామేశ్వరరావు (రేడియో అన్నయ్య)గారువెలగావారిని" జ్ఞాన మహతి"తో పోల్చి ప్రశంసించారు. వీరు అనేక వయోజన విద్య ప్రచార కార్యక్రమాలను నిర్వహించి వయోజను లను జ్ఞానవంతులుగా తయారుచేశారు.  వయోజన విద్యకు సంబంధించి అనేక పుస్తకాలు వ్రాసి చాలామంది రచయితలకు శిక్షణ ఇచ్చి వయోజన విద్య కార్యక్రమాలను ప్రోత్సహించారు. డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి వద్ద శిక్షణ పొంది సాహిత్య అభివృద్ధికి కృషి చేశారు. అనేకమైన బాల సాహిత్య శిక్షణ శిబిరాలు నిర్వహించి అనేకమంది నూతన బాల సాహిత్య రచయిత  లను తయారు చేశారు. ప్రాచీన సాహిత్య సంపదను సేకరించారు. బాలల కోసం అనేకమైన గ్రంథాలను రచించారు. కొత్తగా వచ్చిన బాల  సాహిత్య రచయితలచే బాలసాహిత్యంలో అనేక రచనలు చేయించారు. కొన్ని గ్రంథాలకు సంపాద  కునిగా కూడా పని చేశారు. సశేషం )