ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -3- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
September 5, 2020 • T. VEDANTA SURY • Memories

బాలసాహిత్యంలో గల బాలగేయాలను ఎల్ కె జి యు కె జి స్థాయి పిల్లలకు అతి చిన్నవిగా ఉన్నవాటినే నేడు 
రైమింగ్స్ అను పేరుతో వినియోగిస్తున్నారు. ఉదాహరణకు
" చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ/ బంగారు మొలతాడు
పట్టుదట్టి......."// ఒప్పులకుప్ప వయ్యారి భామ/ సన్న 
బియ్యం ఛాయపప్పు......."   " బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెళితివి?/రాజుగారి తోటలోన మేతకెళ్తిని/రాజుగారి తోటలోన ఏమి చూస్తివి ?/ రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని/పూల చెట్లు నీవు చూసి ఊరకుంటివా?/ఊరుకోక పూలచెట్లు మేసి వస్తిని/మేసివస్తే తోటమాలి ఏమి చేసెను?/తోటమాలి కొట్టవస్తే తుర్రుమంటిని " అలానే మరో ప్రఖ్యాత బాలగేయం బాలల నోట్లో బాగా నలిగేది " చిట్టీ చిలకమ్మా ! అమ్మా కొట్టిందా ?/నిను అమ్మాకొట్టిందా?/తోటలోకెళ్ళావా? పండు తెచ్చావా?/గూట్లో పెట్టావా?గుటుక్కు మింగావా? " ఇక  చీమ  మీద పాటను చూద్దాం " చిట్టి చీమ ! చిట్టి చీమ ఎక్కడికెళ్ళావు?/ చిట్టిపాప పుట్టినరోజు విందుకెళ్ళాను/చిట్టిపాప విందుకెళ్ళి ఏం చేసావు?/చిట్టిపాప బుగ్గపైన ముద్దు పెట్టాను/ముద్దు పెట్టి చిట్టిచీమ ఏం చేసావు?/పొట్టనిండ పాయసం మెక్కి వచ్చాను."/ చందమామ రావే జాబిల్లి రావే !/కొండెక్కిరావే  గోగిపూలు తేవే/బండెక్కిరావే బంతిపూలు తేవే........."ఇక బుజ్జి పాపపై గేయం చూద్దాం! " బుజ్జిపాప బుజ్జిపాప కస్సుమన్నది/నాన్న చెప్పిన వర్లు గొడ్లుకాయనన్నది/ అమ్మ  చెప్పిన అంట్లు గిన్నెలు కడుగ నన్నది/అక్క చెప్పిన బండచాకిరి చేయనన్నది......అన్నతోటి తాను బడికి వెళ్తానన్నది/పంతులు చెప్పే పాఠాలు వింటా నన్నది.// " హాయి హాయి ఓ పాపాయి/తైలమిస్తా రావోయి. .........."//పాపల్లారా రారండీ. చక్కని రంగులు చూడండి ........"//చుక్ చుక్ రైలు వస్తోంది/దూరం దూరం జరగండి/ ఆగినాక ఎక్కండి.....//చిన్నోడమ్మ  చిన్నోడు /చిన్ని సైకిలు కొన్నాడు/ రాళ్ళ మీద తొక్కాడు/ కాలు జారిపడ్డాడు/ ఆసుపత్రిలో చేరాడు మందు బిళ్ళలు మింగాడు..." ఇలాంటి బాలగేయాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఈ బాలగేయాలకు  సంగీత స్వరాలను చేేేకూర్చితే బాలలకు వీనులవిందుగా ఉంటుంది. ఆనందదాయకంగా ఉంటుంది. పైన నేను పేర్కొన్న గేయాలలో దేనిని చూసినా అలతి అలతి పదాలతో 4, 5 సంవత్సరాల (ఎల్ కె జి ; యు కె జి ) బాలలు నిత్య
జీవితంలో మాట్లాడే భాషలో వ్రాయబడ్డాయి. బాలలు 
సులభంగా వాటిని నేర్చుకోవచ్చు. ఈ గేయాల ద్వారా 
విషయపరిజ్ఞానం, లోకజ్ఞానం బాలలు పొందడం జరుగు తుంది. బాలసాహిత్య రచయితలు రచనలు చేసేటప్పుడు
పైవిషయాలను పరిగణనలోకి తీసుకుని రచనలు చేయాలి. ( సశేషం )