ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -5-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252
September 8, 2020 • T. VEDANTA SURY • Memories

దీనికి ముందు భాగంలో రెండవతరగతికి సంబంధించినబాలగేయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 8, 9 సంవత్సరములకు సంబంధించిన అంటే 3,4 తరగతి పిల్లల బాలగేయాల గురించి చూద్దాం. ముందుగా మూడవతరగతి చదువుచున్న 8 సంవత్సరముల పిల్లల బాలగేయం రుతువులు గురించి " వసంత రుతువు వచ్చింది/వసుధకు అందం తెచ్చింది/పచ్చాపచ్చని చిగుర్లుతో/పరవశాన్ని కలిగించింది /వసంత రుతువు వచ్చింది//గ్రీష్మరుతువు వచ్చింది/ఎండలు  మెండుగ తెచ్చింది/మండే సూర్యుని జ్వాలలతో/మలమల జగతిని మాడ్చింది/గ్రీష్మ రుతువు వచ్చింది//వర్ష రుతువు వచ్చింది/వానలు వరదలు తెచ్చింది/ఊటలు నీటిని నింపింది/ఉర్వికి ఊరటనిచ్చింది/వర్ష రుతువు వచ్చింది//శరదృతువు వచ్చింది/చల్లని వెన్నెల నిచ్చింది/కార్తీక దీపం వెలిగింది/ఉర్వికి ఊరట నిచ్చింది/వర్ష రుతువు వచ్చింది// శరదృతువు వచ్చింది/చల్లని వెన్నెల తెచ్చింది/కార్తీకదీపం వెలిగింది/పుడమిని కాంతులు నింపింది/శరదృతువు వచ్చింది//హేమంత రుతువు వచ్చింది/హిమబిందువులనుతెచ్చింది/ముత్యపు ముగ్గులు పరిచింది/ముద్దు మురిపెం పంచింది/హేమంత రుతువు వచ్చింది//అనే గేయాన్ని తేలిక పదాలతో రమ్యంగా పాట సాగింది. ఇక నాల్గవ తరగతి  అభినయ గీతంగా దాశరథి కృష్ణమాచార్యులుగారు రచించిన ' పిల్లిబావ అలుక--ఎలుక పిల్ల విందు' అనే గేయాన్ని ' ఎలుక విందు' అనే శీర్షికతో 
ప్రవేశపెట్టడం జరిగింది. గేయంలోకి వెళ్దాం.  " ఎలుక వచ్చి
పిల్లిబావ నేమన్నదీ/అలుక వీడి తన ఇంటికి రమ్మన్నదీ//
అసలు పిల్లి అలిగి యేల కూర్చున్నదీ/ఎలుక పిల్ల ఎన్నడేమి
పెట్టకున్నదీ//విందుచేతు నేడు నీవు రమ్మన్నదీ/ఎలుక
మాటలకు పిల్లి నవ్వుకొన్నదీ//ఎలుక ముందు, పిల్లి వెనక 
ఏగుచున్నవీ/కలుగులోన రెండు కూడా కలుసుకొన్నవీ//
భూమి అడుగులోన ఎలుక కిల్లున్నదీ/ఇంటిలోన దానికొక్క 
తల్లున్నదీ//ఇల్లుజూచి పిల్లి యెంతొ మెచ్చుకున్నదీ/భూమి
లోని ఎలుకమేడ పెద్దగున్నదీ//.................// ఈ మాటలు  విని పిల్లలు ఎలుకను ముద్దాడిరి/ఎలుక పిల్లతో వారూ ఆడిరీ పాడిరీ//. ఇలా గేయం మొత్తంపై 33 స్టాంజాలుంటాయి. రెండు లైన్ లు ఒక స్టాంజా. అంటే మొత్తం 66 లైన్ లు ఉంటాయి. ఇలాంటి పెద్ద గేయం "చందమామ--నెహ్రూ మామ" అనునది కూడా. ఇందులో20స్టాంజాలుంటాయి. రెెండు లైన్ల చొప్పున 19 స్టాంజాలు, 4 లైన్లు చొప్పున 1 స్టాంజా ఉంటుంది. మొత్తం 42 లైన్లు ఉంటాయి. గేయంలో రెండు లైన్లకు ఒక స్టాంజా చొప్పున్న అన్నీ ఉండి 4 లైన్లను ఒక స్టాంజాగా గేయం మధ్యలో పెట్టడం ఒక నూతన ప్రయోగం అనిపిస్తుంది. దాశరథి వ్రాసిన ' జేజేలు' అను గేయంలో రెండు లైన్లకు ఒక స్టాంజా చొప్పున 16 స్టాంజాలు అంటే 32 లైన్లు ఉంటాయి. ' చేయవలసినవీ--మానవలసి నవీ'  లో రెండు లైన్ ల చొప్పున 11 స్టాంజాలు, నాలుగు లైన్లు చొప్పున 5 గేయాలు మొత్తం 42 లైన్లు ఉంటాయి.  ఇలాదాశరథి చిన్నా పెద్దా కలిసి 21 బాలగేయాలు వ్రాసారు. అంతేగాక దాశరథి కొన్ని వందల కొలది విప్లవాత్మక కవితలు, దేశభక్తిగేయాలు, చైతన్యగీతాలు అనేకం వ్రాసారు. అందులో కొన్ని పేరుకు కవితలు. వాటిలో కొన్నింటిని బాలలు పాడుకొనేందుకు వీలుగా మనం వాటిని మలచుకోవచ్చు.శ్రీ వేదులసత్యనారాయణశాస్త్రిగారు వ్రాసిన " స్వతంత్రోత్సవం" దేశభక్తి గీతాన్ని  ఐదవ తరగతి పిల్లలకు అభినయ గీతంగా ప్రవేశపెట్టారు. దీనిని ఒకసారి చూద్దాం. " పవిత్ర భారత సవిత్రికోహో/స్వతంత్రోత్సవం సాగింది/లాల్ ఖిలాపై అశోకచక్రపు/ త్రివర్ణ కేతనమెగిరింది #పవిత్ర#// మతం తలపక గతం తడవక/ద్వేషం రోషం సకలం మరచి/స్వతంత్ర భారత జయ పతాకను/సోదరులారా మ్రొక్కండి #పవిత్ర#//నెత్తురులోడ్చిన సత్తువ లూడ్చిన/పిశాచ దాశ్యం నశించిందనీ/ప్రపంచమంతా ప్రతిధ్వనింపగ/స్వతంత్ర శంఖాలూ దండి#పవిత్ర#//పోరుల మ్రందిన కారల కుందిన/స్వతంత్రయోధుల స్మరించుకుంటూ/ముదశ్రుతర్పణ హృదంబుజార్పణ/సోదరులారా చేయండి#పవిత్ర#//అమోఘ శక్తుల సమీకరించుక/సమస్త భారత సమైక్యమెం చుక/హిమాద్రి మొదలు కుమారి వరకు/భారత విజయం పాడండి#పవిత్ర# ఇలాంటి దేశభక్తి గీతాన్ని అయిదవ తరగతి పిల్లలకు నేర్పడం ఎంతైనా ముదావహం. అలాగే నేను చదివిన బాలసాహిత్య గ్రంథాలపై మరికొంత సమాచారం రేపటికి.  సశేషం