ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
బాల సాహిత్యం -7- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, --ఫోన్ : 701 3660 252.
September 11, 2020 • T. VEDANTA SURY • Memories

కరుణశ్రీవారి "తెలుగుబాల"నందుగల నూరు పద్యములలో కొన్ని ముఖ్యమైన నీతులను, ప్రబోధములనుచెప్పుకుం  దాము. ----- " ఐనవారి నెల్ల అవహేళనము జేసి/కానివారి తోడ కలియరాదు// సాటివానితోడ జగడమాడరాదు/తీరుపులకు పరుల జేరరాదు//తనకు తగని పిచ్చి పనులకు పోనేల/అడుసు త్రొక్కికాలు కడుగుటేల//కష్టసాధ్యమైన కార్యమ్ము నెరవేర్ప/నైకమత్యమే మహాబలమ్ము//కలిమి గలుగ నేస్తకాండ్రు వేలకువేలు/కలిమి లేక చెలిమికాండ్రు లేరు/లేమి వేళ మిత్రులేప్రాణమిత్రులు//ఆటలాడబోకు మల్లరి జట్టుతో/వేటలాడబోకు వెఱ్ఱి ప్రజల/మాట్లాడబోకు మర్యాద విడనాడి//వెతకి వెతకి వారి వీరి కావ్యాలలో/గతికి గతికి కడుపు కక్కురితికి/అతుకు లతుకు కుకవి బ్రతుకేమి బ్రతుకురా//కలము పట్టగానే కవిశేఖరుడు గాడు/గద్దె నెక్కగానే పెద్ద గాడు/శాటి గట్టగానే సన్యాసి గాడురా//ధనము గలుగు చోట ధర్మంబు కనరాదు/ధర్మ మున్నచోట ధనములేదు/ధనము ధర్మమున్న మనుజుండె ఘనుడురా//ధనము గలిగి దానధర్మాలు చేయని/నరుడు ధరణి కెంతొ బరువు చేటు//సాధనమున కార్యసాఫల్యమొనగూడు/లలిత  సుగుణజాల ! తెలుగుబాల !//మెదడు పాడుచేయు, మేనెల్ల చెడగొట్టు/కీర్తినపహరించు,నార్తి పెంచు/క్రూర జనుల మైత్రి కుష్ఠురోగమ్మురా//దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు,  భ్రాతృజనము వచ్చి పంచుకోరు/విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా//కోరబోకు మెపుడు మేరమీరిన కోర్కె/చేరబోకు
మెపుడు క్రూరజనుల/మీరబోకు పెద్దవారు చెప్పినమాట//
మనసు, మధుకరంబు, మధ్యంబు, మత్స్యంబు/మదము, మర్కటంబు, మారుతంబు/చంచలంబులివ్వి, సప్తమకార ముల్//జనని, జన్మభూమి, జనకుండు, జాతీయ/కేతనంబు,
జాహ్నవీతటంబు/పరమపావనములు పంచ జకారముల్/
లలిత సుగుణజాల తెలుగుబాల !// వీటిలో చాలావరకూ 
వేమన శతకములో నీతులను బోలియున్నవి. వేమన శతకంలో  కొన్ని పద్యాలను చూద్దాం. '' ఆలిమాటలు విని అన్న దమ్ముల బాసి/వేరుపడుచునుండు వెర్రివాడు/కుక్కతోకబట్టిగోదావరీదునా‌!/విశ్వదాభిరామ వినురవేమ//  అనువుగాని చోట అధికులమనరాదు/కొంచెముందు టెల్ల కొదువగాదు/కొండ అద్దమందు కొంచమై ఉండదా ?//దుష్టజనుల గూడి తుంటరిపనులను/శిష్టకార్యములుగ చేయుచుంద్రు/కూడదనెడివారి గూడ నిందింతురు//కల్లలాడుకంటె కష్టమ్ము
మరిలేదు/కష్టమెపుడో కీడుకలుగజేయ/ద్విజుడనుటను చూడదిమ్మరితనమురా!//అన్ని దానములను నన్నదానమె
గొప్ప/కన్నవారి కంటె ఘనులు లేరు/ఎన్న గురునికన్న నెక్కువ లేదయా//తనివితీర గురుని ధ్యానించి మదిలోని/
తనువు మరచి గురుని తాకినపుడె/తనరుచుండు బ్రహ్మ తత్త్వం మందురు దాని//అనువుగాని చోట అధికులమన రాదు/కొంచెముండుటెల్ల కొదువ కాదు/కొండ అద్దమందు 
కొంచమై యుండదా ?/విశ్వదాభిరామ వినురవేమ"// అని 
ఇలా వేమన వ్రాసిన పద్యాలు కోకొల్లలు ఉన్నాయి. మనం కరుణశ్రీగారి పద్యాలు చదువుతున్నప్పుడు వేమన పద్యాలు
గుర్తుకు రావడం సహజం. వేమన పద్యాలు పిన్నలకూ,  పెద్దలకు ఎంత ఉపయుక్తమైనవో జంథ్యాల పాపయ్యశాస్త్రి గారి పద్యాలు కూడా అంతే ! జంథ్యాలవారు తరువాత భాగం " విశ్వ సందేశ లహరి." ఇందులో 1. గురుదత్తాష్టకం,
2.వరాలస్వామి,  3.  ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త 
4. సాక్షాత్కారము 5. విశ్వమందిరము 6. సంస్తుతి 7. విశ్వ
సందేశ లహరి. ఇవన్నీణ  భక్తి పారవశ్యంతో కూడుకున్న రచనలు. " విశ్వమందిరము" శీర్షికతో వ్రాసిన పద్యాలను 
కొన్నింటిని ఇక్కడ చూద్దాం. " తెలుగు గగనాన విశ్వమంది రములోన/ప్రభవమందెను విశ్వ ప్రభాకరుండు/కటిక చీకటి దొంతరల్ కరిగిపోయె/మురిసినవి దీనజన మనస్సరసిజములు"//తెలుగు  నగరాన విశ్వమందిరము లోన/వినపడెను విశ్వమోహన వేణుగీతి/పొంగి పొరలెను యమునా తరంగ పంక్తి/నవ్వి నటనం బొనర్చె బృందా వనంబు//విశ్వయోగి దారి వేదాంత జయభేరి/విశ్వయోగి వాణి వేదవాణి/విశ్వయోగి పల్కు వేదసుధల్ చిల్కు/విశ్వయోగి వాక్కు వేదవాక్కు// లాంటి పద్యాలు ఇందులో
ఉంటాయి. విశ్వమందిరము(5 శీర్షిక) యొక్క విశ్వస్వరూప అందాలను కరుణశ్రీ పద్యాలను  తనివితీరా చదివి ఆనందించవలసిందే ! 1 నుండి 4 శీర్షికలలో గల పద్యాలు జంథ్యాల పాపయ్యశాస్త్రిగారు ఆరాధించే దేవుళ్ళు,  వారిపై అతనికి గల భక్తి పారవశ్యాన్ని మనం చూడవచ్చు. (సశేషం )